- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అరుదైన రికార్డును సొంతం చేసుకున్న 'కుర్చీ మడత పెట్టి' సాంగ్
'గుంటూరు కారం'లోని 'కుర్చీ మడతపెట్టి' పాట తెలుగులో అత్యంత వేగంగా 800 మిలియన్ వ్యూస్ సాధించిన సాంగ్‌గా కొత్త రికార్డు సృష్టించింది.

దిశ, వెబ్ డెస్క్: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన చిత్రం 'గుంటూరు కారం'. ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా, ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించారు. ఈ చిత్రంలోని 'కుర్చీ మడతపెట్టి' పాట ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాట విడుదలైన తర్వాత దీనిపై పలు వివాదాలు చెలరేగినా, వాటన్నింటినీ అధిగమించి ఈ సాంగ్ సెన్సేషన్ హిట్‌గా నిలిచింది. తాజాగా ఈ పాట మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది.
తెలుగులో అత్యంత వేగంగా 800 మిలియన్ వ్యూస్ సాధించిన పాటగా 'కుర్చీ మడతపెట్టి' కొత్త రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఈ పాట దూసుకెళ్తున్న వేగాన్ని చూస్తుంటే త్వరలోనే 1 బిలియన్ వ్యూస్ మైలురాయిని కూడా అందుకోవడం ఖాయమని మహేష్ అభిమానులతో పాటు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పాటలో మహేష్ బాబు, శ్రీలీల ఎనర్జిటిక్ డ్యాన్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా, ఎస్.ఎస్. తమన్ అందించిన మాస్ బీట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శ్రీకృష్ణ, సాహితి చాగంటి ఆలపించిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. మొత్తంగా విడుదలైన చాలా కాలం తర్వాత కూడా 'కుర్చీ మడతపెట్టి' పాట అదే క్రేజ్‌తో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది.






