- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Harish Rao: 20 వేల పోలీస్ పోస్టులను భర్తీ చేయాలి
పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వద్ద తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఆందోళన చేస్తోన్న నిరుద్యోగులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపడాన్ని బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉపనేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు.

దిశ, వెబ్‌డెస్క్: పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వద్ద తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఆందోళన చేస్తోన్న నిరుద్యోగులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపడాన్ని బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉపనేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న అభ్యర్థులను పోలీసులు రోడ్లపై ఈడ్చుకెళ్లి.. అక్రమంగా అరెస్టులు చేయడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియంతృత్వ ధోరణికి అద్దం పడుతోందని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు హరీశ్ రావు సోమవారం సోషల్ మీడియా వేదికగా ట్వీట్ ఎన్నికల సమయంలో మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్పి గద్దెనెక్కిందని హరీశ్ రావు విమర్శించారు. తీరా అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను పక్కనబెట్టి, హక్కుల కోసం పోరాడుతున్న యువతను అణచివేస్తూ రేవంత్ రెడ్డి రాష్ట్రంలో 'హిట్లర్' పాలనను కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. నిరుద్యోగుల గొంతు నొక్కాలని చూడటం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు.
బీఆర్ఎస్ డిమాండ్లు ఇవే..
శాంతియుత నిరసనల్లో అక్రమంగా అరెస్ట్ చేసిన నిరుద్యోగ అభ్యర్థులందరినీ ప్రభుత్వం బేషరతుగా, తక్షణమే విడుదల చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. అలాగే, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులపై స్వయంగా డీజీపీ ప్రకటన చేసిన నిజాన్ని గుర్తు చేస్తూ.. ఆ 20 వేల పోలీస్ పోస్టులకు వెంటనే పూర్తిస్థాయి నోటిఫికేషన్ విడుదల చేయాలని బీఆర్ఎఎస్ పక్షాన ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల పోరాటానికి బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.






