నాలుగేళ్ల తర్వాత బాక్సాఫీస్ బరిలో చిరు - బాలయ్య

by Pulgam srinivas |

నాలుగేళ్ల తర్వాత మరోసారి సంక్రాంతి బరిలో చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

నాలుగేళ్ల తర్వాత బాక్సాఫీస్ బరిలో చిరు - బాలయ్య
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ తమ కెరీర్‌లో ఇప్పటివరకు ఎన్నోసార్లు బాక్సాఫీస్ వద్ద పోటీపడ్డారు. ముఖ్యంగా సంక్రాంతి బరిలో పలుమార్లు తలపడి అభిమానులకు మంచి వినోదాన్ని అందించారు. చివరిసారిగా 2023 సంక్రాంతి సందర్భంగా బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన 'వీర సింహారెడ్డి', చిరంజీవి హీరోగా రూపొందిన 'వాల్టేర్ వీరయ్య' చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డాయి. ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయాలను అందుకోగా, 'వాల్టేర్ వీరయ్య' ఆ ఏడాది సంక్రాంతి విజేతగా నిలిచింది.

ఇక నాలుగేళ్ల తర్వాత, అంటే వచ్చే ఏడాది సంక్రాంతికి మరోసారి చిరంజీవి, బాలకృష్ణ బాక్సాఫీస్ పోరుకు సిద్ధమవుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న 'విశ్వంభర', అలాగే బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం సంక్రాంతి బరిలో నిలిచే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలు నిజమైతే వచ్చే సంక్రాంతి పోటీ మరింత రసవత్తరంగా మారే అవకాశముందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇప్పటివరకు ఈ రెండు చిత్రాల విడుదల తేదీలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో ఈ సినిమాలు ఎప్పుడు విడుదలవుతాయనే ఆసక్తి సామాన్య ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో కూడా నెలకొంది.

Next Story