- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సిర్పూర్ నియోజకవర్గ రోడ్లకు మహర్దశ
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని రహదారుల అభివృద్ధికి భారీగా నిధులు మంజూరయ్యాయి.

దిశ, ఆసిఫాబాద్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని రహదారుల అభివృద్ధికి భారీగా నిధులు మంజూరయ్యాయి. ఆర్ అండ్ బి రహదారుల అభివృద్ధి కోసం హైమ్ ఫేజ్-1 ప్రాజెక్ట్ కింద రూ.203.76 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాగజ్‌నగర్ ఎక్స్ రోడ్ నుంచి సిర్పూర్ వరకు డబుల్ రహదారి నిర్మాణానికి రూ.73.22 కోట్లు, సిర్పూర్ నుంచి మహారాష్ట్ర సరిహద్దు వరకు రహదారి అభివృద్ధికి రూ.10.50 కోట్లు మంజూరైనట్లు వెల్లడించారు. అలాగే దహేగాం మండలం నుంచి కల్వాడ-ఒడ్డుగూడ రహదారి నిర్మాణానికి రూ.53.52 కోట్లు, చింతలమానేపల్లి మండలంలోని బాబాసాగర్ గూడెం రహదారి అభివృద్ధికి రూ.15.80 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. అదనంగా కాగజ్‌నగర్, సిర్పూర్ పట్టణాల్లో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ నిధులతో నియోజకవర్గంలో రవాణా సౌకర్యాలు మెరుగుపడి, ప్రజలకు ప్రయాణ సౌలభ్యం కలుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.






