అర్హత ఉన్న ఒక్క ఓటు కూడా పోకుండా జాగ్రత్త తీసుకోవాలి: మంత్రి పొన్నం

by Kodari Anjali |   (  Updated:2026-06-29 09:41:43  IST  )

అర్హత ఉన్న ఒక్క ఓటు కూడా పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి బూతు లెవల్ అధికారులకు, బూతు లెవల్ ఏజెంట్లకు మంత్రి పొన్నం సూచించారు.

అర్హత ఉన్న ఒక్క ఓటు కూడా పోకుండా జాగ్రత్త తీసుకోవాలి: మంత్రి పొన్నం
X

దిశ, సైదాపూర్: అర్హత ఉన్న ఒక్క ఓటు కూడా పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి బూతు లెవల్ అధికారులకు, బూతు లెవల్ ఏజెంట్లకు మంత్రి పొన్నం సూచించారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని ఎలుగో తారం గ్రామంలో జరుగుతున్న ఎస్ఐఆర్ కోసం ఓటరు సవరణ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికీ జరుగుతున్న ఎన్యూమరేషన్ ప్రక్రియను పరిశీలించిన మంత్రి, బూత్ లెవల్ అధికారులు,బూత్ లెవల్ ఏజెంట్లుతో మాట్లాడి.. ఫారాల పంపిణీ, నమోదు పురోగతి, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలపై ఆరా తీశారు. అర్హులైన ఒక్క ఓటరు కూడా నమోదు కాకుండా మిగిలిపోకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, 2002 మరియు 2025 ఓటరు జాబితాలను ప్రామాణికంగా తీసుకుని ప్రతి ఇంటికి ఎన్యూమరేషన్ ఫారాలు చేరేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గ్రామస్తులతో నేరుగా మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్, తమ ఓటరు వివరాలను సరిచూసుకుని అవసరమైన పత్రాలతో ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తి చేసి సమర్పించాలని సూచించారు. స్వచ్ఛమైన, సమగ్ర ఓటరు జాబితా రూపకల్పనలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. సైదాపూర్ మండలం గోడిశాల గ్రామంలో ఎల్లమ్మ బోనాల వేడుకలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ దొంత సుధాకర్, మండల పార్టీ అధ్యక్షుడు చాడ కొండాల్ రెడ్డి,సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు జున్నూతుల రాజిరెడ్డి, సర్పంచులు గ్రామ శాఖ అధ్యక్షులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story