- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో 30 వేల డూప్లికేట్ ఓట్లు.. కవిత సెన్సేషనల్ కామెంట్స్
సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్ లో కర్ణాటక ఓటర్లు ఉన్నారని కవిత సంచలన ఆరోపణలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణలో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్‌తో పాటు బోధన్ నియోజకవర్గంలో ఓట్ల తొలగింపు, చేర్పులపై ఆమె పలు సంచలన ఆరోపణలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొండగల్ నియోజకవర్గంలో దాదాపు 30 వేల డూప్లికేట్ ఓట్లు ఉన్నాన్నాయని ఇందులో పొరుగున ఉన్న కర్ణాటకలోని సెడం నియోజకవర్గం నుంచి 11 వేల మంది కొడంగల్‍లో ఓటర్లుగా ఉన్నారని ఆరోపించారు. కొడంగల్ నియోజకవర్గం పరిధిలోనే 22 వేల డూప్లికేట్ ఓట్లు ఉంటే, 11 వేలు కర్ణాటక ఓటర్లు ఉన్నారని ఇక్కడ డూప్లీకేట్ ఓటర్లు ఎన్ని ఉన్నాయో అంతే మార్జిన్‍తో రేవంత్ రెడ్డి గెలుపొందారన్నారు. అంటే సీఎంకు ఈసీ ఫేవర్ చేసిందా? దీనిపై మా అనుమానాలను ఈసీ నివృత్తి చేయాలన్నారు. ఇవాళ బంజారాహిల్స్ లోని టీఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
బోధన్‌లో 7 వేలు.. కొడంగల్‌లో 800 మాత్రమే ఎందుకు?
SIRలో ఆశ్చర్యంగొల్పే విషయాలు వెలుగులోకి వచ్చాయని కవిత చెప్పారు. ఓట్ల ఏరివేతలో ఈసీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని మండిపడ్డారు. స్వాతంత్ర్యం వచ్చాక మన దేశంలో ఎస్ఐఆర్ 8 సార్లు జరిగితే ప్రతి యేడాది ఎస్ఎస్ఆర్ జరుగుతుందని కవిత చెప్పారు. అయితే తెలంగాణలో 2026లో జరుగుతున్న ఎస్ఐఆర్‍కు ప్రామాణికంగా 2026 జనవరి నాటి వివరాలు కాకుండా 2025 జనవరి నాటి ఎస్ఎస్ఆర్ జాబితాను తీసుకోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. దీనిపై తాము లోతుగా అధ్యయనం చేస్తే విస్తుగొల్పే విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు. ఈ ఏడాదిన్న కాలంలో బోధన్ నియోజకవర్గంలో 7 వేల ఓట్లు తొలగించారని వాళ్లు షిప్ట్ అయ్యారా, చనిపోయారా? డూప్లికేషన్ ఓట్ల అనేది ఈసీ చెప్పటం లేదన్నారు. ఇదే సమయంలో సీఎం నియోజకవర్గం కొడంగల్‍లో మాత్రం కేవలం 808 ఓట్లు మాత్రమే తొలగించారని బోధన్ లో 7 వేలు కొడంగల్ లో 808 మాత్రమే ఎందుకు తొలగించాలని ప్రశ్నించారు. ఎస్ఐఆర్ మీద చాలా అనుమానాలు ఉన్నాయి. అన్నింటిపై ఈసీ క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రకాశ్ రాజ్ ఓట్లు తొగించేందుకు 7 ఏళ్లు:
సినిమా యాక్టర్ ప్రకాష్ రాజ్‍కు మూడు రాష్ట్రాల్లో ఓటు ఉందని చెబుతున్నారు. ఆ ఓట్లను తొలగించేందుకు ఏడు ఏళ్లు పడితే భోదన్‍లో మాత్రం ఏడాదిన్నరలో 7 వేల ఓట్లు తొలగించారని కవిత ధ్వజమెత్తారు. ఒక నియోజకవర్గంలో 2 శాతం కన్నా ఎక్కువ ఓట్లను తొలగించాల్సి వస్తే తొలిగించే ప్రతి ఓటరుకు మూడుసార్లు నోటీసులు ఇవ్వాలని ఈసీ నిబంధన ఉంది. కానీ ఆ విధంగా ఎవరికీ నోటీసు ఇవ్వలేదు. ఇస్తే ఈసీ దీని గురించి స్పష్టమైన సమాచారం ఇవ్వాలన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మన దేశంలో వేరే దేశంలో వాళ్లకు ఓట్లు ఉండవద్దని అంటున్నారు. దానికి మేము అంగీకరిస్తాం. కానీ ఒక రాష్ట్రంలో ఓటు ఉన్న వాళ్లకు మరొక రాష్ట్రంలో ఉండవచ్చా? మీరు ఒక రాష్ట్రంలో వేరే దేశ పౌరుడి ఓటు తొలగిస్తే వాళ్లు మరొక రాష్ట్రానికి వచ్చి నమోదు చేసుకోరా? అసలు ఇంటర్ స్టేట్ లో ఓట్ల డూప్లికేషన్ ను ఏరివేసేందుకు ఈసీ దగ్గర మెకనిజమే లేదు. అలాంటప్పుడు 14 వందల కోట్లు పెట్టి ఎస్ఐఆర్ చేయటం వల్ల ప్రయోజనం ఏంటీ? అని నిలదీశారు.
పక్క రాష్ట్రం ఓట్లపై..
ఈ ఎస్ఐఆర్ ద్వారా దేశంలో డూప్లికేషన్ ఓట్లు ఉండకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ నిర్వహించే పరిస్థితి రావాలన్నారు. వన్ నేషన్, వన్ ఎలక్షన్, వన్ ఓటు అనే పరిస్థితి ఉండాలన్నారు. కచ్చితంగా ఇంటర్ స్టేట్ మైగ్రేషన్, డూప్లికేషన్ అంశంపై దృష్టి పెట్టాలని అదే విధంగా దేశంలో ఉండే సంచార జాతుల వాళ్లకు ఏ విధంగా ఓటు ఇస్తారో చెప్పాలన్నారు. ఒక ఇంట్లో ఉండే వాళ్లందరికీ ఓకే బూత్ లో ఓటు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్ఐఆర్ ద్వారా ఇంటర్ స్టేట్ డూప్లికేషన్ ఓట్లను కూడా కట్ చేయాలి. లేదంటే ఎస్ఐఆర్‍కు అర్థం ఉండదని చెప్పారు. ఎస్ఐఆర్ అనేది పర్మినెంట్ సొల్యుషన్‍గా ఉండాలని మేము కోరుతున్నామన్నారు. మాలాంటి కొత్త పార్టీకి ఇది చాలా ఇంపార్టెంట్ అని కచ్చితంగా ఫెయిర్ గా ఎన్నికల జాబితా సిద్ధం చేయాలని ఈసీని కోరుతున్నామన్నారు. మేము లేవనెత్తిన ప్రశ్నలన్నింటికీ ఈసీ సమాధానం చెప్పాలని వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాం.






