రిలే నిరాహార దీక్షలు చేపట్టిన అధికారులు

by Jakkula.Mamatha |   (  Updated:2026-06-29 07:56:35  IST  )

తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని సమస్యలపై యాజమాన్యం ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని డిమాండ్ చేస్తూ గత వారం రోజులుగా సీఎంఓఏఐ అధికారుల సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు.

రిలే నిరాహార దీక్షలు చేపట్టిన అధికారులు
X

దిశ, కొత్తగూడెం సింగరేణి: తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని సమస్యలపై యాజమాన్యం ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని డిమాండ్ చేస్తూ గత వారం రోజులుగా సీఎంఓఏఐ అధికారుల సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. యాజమాన్యం ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో సోమవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అధికారులకు పర్ఫామెన్స్ రిలేటెడ్ పై ఉంటుందని, 2022-2023వ సంవత్సరంలో ఇవ్వాలని, 2023-2024 సంవత్సరానికి కూడా ఇవ్వాలి. ఆ పత్రాల గురించి అనేకసార్లు విన్నవించామని అన్నారు. అలాగే రియాప్రిడేషన్ కూడా అమలుపరచాలని కోరారు. విధానం కోల్ ఇండియాలో ఇంప్లిమెంట్ అవుతుందని, వాళ్లకు 6 నెలల నుంచి ఇస్తున్నారని, అయితే సింగరేణిలో దీనిని ఎందుకు అమలు చేయడం లేదని, వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏరియా జిఎం కార్యాలయం ఎదుట రిలే దీక్షలను చేపట్టినట్లు స్పష్టం చేశారు.

Next Story