‘గ్రీవెన్స్ డే’కి హాజరైన వివిధ శాఖల అధికారులు

by Jakkula.Mamatha |

గ్రామాల్లో ఉన్న సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడంతో అధికారుల దృష్టికి తీసుకురావాలని మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రీవెన్స్ డే పేరుతో స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో అధికారులందరూ హాజరు కావాలి.

‘గ్రీవెన్స్ డే’కి హాజరైన వివిధ శాఖల అధికారులు
X

దిశ, ఏన్కూర్: గ్రామాల్లో ఉన్న సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడంతో అధికారుల దృష్టికి తీసుకురావాలని మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రీవెన్స్ డే పేరుతో స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో అధికారులందరూ హాజరు కావాలి. కానీ, కొన్ని శాఖల అధికారులు సీఎం పర్యటన పేరుతో గ్రీవెన్స్ డేకి డుమ్మా కొట్టడం జరిగిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. గైర్హాజరైన శాఖల అధికారులు కోసం దరఖాస్తుదారులు సమస్యలు తెలియజేయడానికి వస్తే ఆ శాఖ అధికారులు లేకపోవడంతో నిరుత్సాహంతో వెనుతిరిగి పోవడం జరుగుతుందని ప్రజల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

వారంలో ఒకసారి జరిగే ప్రజావాణి గ్రీవెన్స్ డే కార్యక్రమానికి కొన్ని శాఖల అధికారులు అలసత్వం వహిస్తూ ప్రజా సమస్యల పట్ల శ్రద్ధ వహించక పోవడం ప్రజల నుంచి ఆగ్రహానికి గురి కావడం జరుగుతుంది. ఇప్పటికైనా ఎలాంటి సమాచారం లేకుండా గ్రీవెన్స్ డే ప్రజావాణి కార్యక్రమానికి గైర్హాజర్ ఆయన శాఖల అధికారుల పై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకునే విధంగా ప్రతి సోమవారం పూర్తిస్థాయిలో ఆయా శాఖలో గ్రీవెన్స్ డేకి హాజరయ్యే విధంగా చూడాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Next Story