రప్పా, రప్పా అంటే పారిశ్రామికవేత్తలు వస్తారా..? : మంత్రి బీసీ జనార్థన్

by Naga Rani Yarlagadda |

వైసీపీ హయాంలో రాయలసీమలో రక్తపుటేరులు పారించారని, కూటమి హయాంలో ఆ ప్రాంతంలో ఇప్పుడు అభివృద్ధి ఊపందుకుంటుంటే చూసి ఓర్వలేకపోతున్నారని మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి విమర్శించారు.

రప్పా, రప్పా అంటే పారిశ్రామికవేత్తలు వస్తారా..? : మంత్రి బీసీ జనార్థన్
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ హయాంలో రాయలసీమలో రక్తపుటేరులు పారించారని, కూటమి హయాంలో ఆ ప్రాంతంలో ఇప్పుడు అభివృద్ధి ఊపందుకుంటుంటే చూసి ఓర్వలేకపోతున్నారని మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి విమర్శించారు. అమరావతిలో సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. జగన్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. అభివృద్ధికి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ గా నిలుస్తుంటే.. ప్రతిపక్ష హోదా కూడా దక్కనివారు సిగ్గు, శరం లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రప్పా..రప్పా.. నరుకుతాం అంటే పారిశ్రామికవేత్తలు వస్తారా? అని మంత్రి ప్రశ్నించారు. గతంలో ఉన్న పరిశ్రమలను సైతం రాష్ట్రం నుంచి తరిమికొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు కూటమి ప్రభుత్వంలో ఎన్నో పరిశ్రమలు రాయలసీమకు వస్తున్నాయని, ఆ ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్ గా మారుస్తున్నామని చెప్పుకొచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గొడ్డలి పార్టీకి డిపాజిట్లు కూడా రావని మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి వెల్లడించారు.

Next Story