పెండింగ్ బిల్లులు ఇవ్వలేదని ప్రభుత్వ పాఠశాలకు తాళం వేసిన కాంట్రాక్టర్

by Jakkula.Mamatha |

గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు సంబంధించిన బిల్లులు రాకపోవడంతో, ఆగ్రహం చెందిన ఒక కాంట్రాక్టర్ ప్రభుత్వ పాఠశాలకు తాళం వేసిన ఘటన ఖమ్మం నగరంలో కలకలం రేపింది.

పెండింగ్ బిల్లులు ఇవ్వలేదని ప్రభుత్వ పాఠశాలకు తాళం వేసిన కాంట్రాక్టర్
X

దిశ, ఖమ్మం టౌన్: గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు సంబంధించిన బిల్లులు రాకపోవడంతో, ఆగ్రహం చెందిన ఒక కాంట్రాక్టర్ ప్రభుత్వ పాఠశాలకు తాళం వేసిన ఘటన ఖమ్మం నగరంలో కలకలం రేపింది. ఖమ్మం నగరంలోని 59వ డివిజన్ దానవాయిగూడెంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... గత ప్రభుత్వ హయాంలో దానవాయిగూడెం ప్రభుత్వ పాఠశాలలో రూ. 26 లక్షల వ్యయంతో మైనర్ వర్క్ పనులను కాంట్రాక్టర్ అయోధ్య చేపట్టారు. అయితే, ఇందులో రూ. 13 లక్షల బిల్లులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత బిల్లుల విడుదల మరింత ఆలస్యమైంది. తన బిల్లులు చెల్లించాలంటూ సదరు కాంట్రాక్టర్ జిల్లా అధికారుల చుట్టూ పలుమార్లు తిరిగిన ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. దీంతో సోమవారం ఉదయం కాంట్రాక్టర్ పాఠశాల ప్రధాన ద్వారానికి తాళం వేశారు. పెండింగ్ బిల్లులు పూర్తిగా చెల్లించే వరకు తాళం తీసేది లేదంటూ అక్కడే భీష్మించుకొని కూర్చున్నారు. పాఠశాల తెరిచే సమయానికి వచ్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది లోపలికి వెళ్లే దారి లేక బయటే నిలబడాల్సి వచ్చింది.

Next Story