- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒక్క సెకన్‌లో ప్రాణాలు కాపాడుకున్న యువకుడు.. వీడియో వైరల్
దిశ, ఫీచర్స్ : భూమి, ఆకాశం మధ్య గాలిలో తెలుతూ పక్షిలా విహరించాలని ఎవరికి మాత్రం ఉండదు.

దిశ, ఫీచర్స్ : భూమి, ఆకాశం మధ్య గాలిలో తెలుతూ పక్షిలా విహరించాలని ఎవరికి మాత్రం ఉండదు. ఇలాంటి అనుభవాన్ని పొందేందుకు చాలా మంది పారాచూట్‌ల హెల్ప్ తీసుకుంటారు. కానీ అన్ని రోజులు అనుకున్న విధంగా ఉండవు గనుక.. పారాచూట్‌లో వీర విహంగం చేయాలనుకున్న వ్యక్తి మరణపు అంచులవరకు వెళ్లొచ్చాడు. ఎలాగని ఆలోచిస్తున్నారా? ఒక్కసారి ఈ వీడియో చూడండి.
స్పెయిన్‌లోని ఆర్గాన్యాలో పారాగ్లైడింగ్ చేస్తున్న కెవిన్ ఫిలిఫ్ గాలిలో విహరిస్తూ.. ఎంజాయ్ చేస్తున్న క్రమంలో విపరీతమైన గాలుల తాకిడికి పారాగ్లైడ్ ఒక్కసారిగా అదుపుతప్పి మొత్తం చుట్టుకుంది. దీంతో భారీ ఎత్తు నుంచి కిందకి పడిపోతుడండం వీడియోలో చూడవచ్చు. ఆ క్షణంలో ఎమర్జెన్సీ పారాచూట్ కూడా ఓపెన్ కాకపోవడంతో పరిస్థితి భయంకరంగా మారింది. అదృష్టవశాత్తు అతి కొద్ది సెకన్లలో పారాచూట్‌ను మాన్యువల్‌గా ఓపెన్ చేసి ప్రాణాలను కాపాడుకున్నాడు కెవిన్. 'రెస్క్యూ ప్యాకేజీని మ్యాన్యువల్‌గా తెరవడం చాలా చివరి అవకాశం. కేవలం ఒక్క సెకను మాత్రమే మిగిలి ఉందని అనుకున్నాను. కానీ బతికి బయటపడ్డాను' అని కెవిన్ చెప్పాడు.






