- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తల్లిదండ్రులకు విషాదం మిగిల్చిన స్పోర్ట్స్ బైక్.. యువకుడు స్పాట్ డెడ్
దిశ, కూకట్‌పల్లి: అర్ధరాత్రి మితిమీరిన వేగంతో వెళుతూ బైకు అదుపుతప్పి- latest Telugu news

X
దిశ, కూకట్‌పల్లి: మితిమీరిన వేగంతో దూసుకెళ్తూ బైకు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఓ యువకుడు మృతి చెందిన ఘటన ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఆల్విన్‌కాలనీ ఫేజ్ 1లో నివాసం ఉంటున్న శివశంకర్‌రెడ్డి కుమారుడు సాయి స్వరూప్ రెడ్డి (23) ఆదివారం రాత్రి 11: 30 గంటల ప్రాంతంలో లోధా బెల్లెంజా అపార్ట్మెంట్వద్ద మితిమీరిన వేగంతో తన కేటీఎం బైక్‌పై వెళ్తుండగా.. బైక్అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సాయి స్వరూప్రెడ్డికి తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించినట్టు సీఐ కిషన్చెప్పారు.
Next Story






