- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెద్ద మనుషుల మాట వినని భార్య.. భర్త చేసిన పనికి అంతా షాక్
దిశ,కొల్చారం : కుటుంబ కలహాలతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన..latest telugu news

X
దిశ,కొల్చారం : కుటుంబ కలహాలతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం కొల్చారం మండలం చిన్న ఘనపూర్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన జింకు సదానందం కుమారుడు జింకు అశోక్ (28) అతని భార్య నవనీతలు తరుచూ గొడవ పడేవారు. కొన్ని రోజుల క్రితం నవనీత అశోక్‌తో గొడవపడి తన పుట్టింటికి చింతకుంట గ్రామానికి వెళ్లి పోయింది.
గ్రామ పెద్దలు చెప్పినప్పటికీ నవనీత ఇంటికి రాకపోవడంతో మనస్తాపం చెందిన అశోక్ బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకొని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కొల్చారం ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Next Story






