ఆ హీరోయిన్ భావోద్వేగాలను ప్రదర్శించే విధానం అద్భుతం.. డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్

by Mallepaka Hamsa |

కోలీవుడ్‌లో యంగ్ సెన్సేషన్‌గా గుర్తింపు తెచ్చుకున్న కాయదు లోహర్ (Kayadu Lohar)ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీ అంతటా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా దూసుకెళ్తోంది.

ఆ హీరోయిన్ భావోద్వేగాలను ప్రదర్శించే విధానం అద్భుతం.. డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్
X

దిశ, సినిమా: కోలీవుడ్‌లో యంగ్ సెన్సేషన్‌గా గుర్తింపు తెచ్చుకున్న కాయదు లోహర్ (Kayadu Lohar)ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీ అంతటా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా దూసుకెళ్తోంది. ప్రజెంట్ వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది. కోలీవుడ్ నటుడు జీవీ ప్రకాష్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఇమ్మోర్టల్’(Immortal) సినిమాలో కాయదు హీరోయిన్‌గా కనిపించనుంది.షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక విడుదలైన అప్డేట్స్ సైతం అంచనాలను రెట్టింపు చేశాయి. ఈక్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు మరియప్పన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ‘‘కాయదు లోహర్‌ను నేను మొదట మలయాళ చిత్రం ‘19వ శతాబ్దం’, అలాగే కొన్ని కన్నడ సినిమాల్లో గమనించాను.

ఆమె హావభావాల్లో ఉన్న సహజత్వం ప్రేక్షకులను వెంటనే ఆకర్షిస్తుంది. ముఖ్యంగా జీవీ ప్రకాష్‌(GV Prakash)తో కలిసి ఆమె నటించిన సన్నివేశాలు హృదయాలను హత్తుకునేలా ఉంటాయి’’ అని మరియప్పన్ తెలిపారు. కాయదు భావోద్వేగాలను ఎంతో లోతుగా, సున్నితంగా తెరపై ఆవిష్కరించే విధానం నిజంగా అద్భుతంగా ఉంటుందని ఆయన అన్నారు. పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగినప్పటికీ, షూటింగ్ సమయంలో ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా రావాలనే తపన ఆమెలో ఇప్పటికీ అదే స్థాయిలో ఉందని కొనియాడారు. జీవీ ప్రకాష్, కాయదు నటనలో ప్రేక్షకులు ఒక ప్రత్యేకమైన ఎమోషనల్ కనెక్షన్‌ను అనుభూతి చెందుతారని, ‘ఇమ్మోర్టల్’ సినిమా ఇద్దరి కెరీర్‌లోనూ గుర్తుండిపోయే చిత్రంగా నిలుస్తుందని దర్శకుడు మరియప్పన్ అశాభావం వ్యక్తం చేశారు.

Next Story