రామ్ న‌ట‌న‌లో ఫైర్ ఉంది.. డైరెక్టర్ శంక‌ర్‌

by Dishanational1 |
రామ్ న‌ట‌న‌లో ఫైర్ ఉంది.. డైరెక్టర్ శంక‌ర్‌
X

దిశ, సినిమా: లింగుస్వామి దర్శకత్వంలో రామ్ పోతినేని పోలీసు ఆఫీసర్‌గా నటించిన చిత్రం 'ది వారియర్'. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడ‌క్షన్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మించగా కృతిశెట్టి హీరోయిన్‌గా కనిపించనుంది. ఇక ఈ మూవీ జూలై 14న విడుదల కానుండగా తాజాగా చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమానికి హాజరైన భార‌తీ రాజా, మ‌ణిర‌త్నం, శంక‌ర్, ఎస్‌.జె.సూర్య, విశాల్, సెల్వమ‌ణి తదితరులు.. లింగుస్వామి ఈ చిత్రాన్ని టెక్నిక‌ల్‌గా అద్భతంగా తీర్చిదిద్దాడని కొనియాడారు. అలాగే ట్రైల‌ర్‌లో రామ్‌ ఓ ఫైర్‌లా క‌నిపించాడని, తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇక ఈ జ‌ర్నీలో తనకు అండ‌గా నిలిచిన ప్రతీ ఒక్కరికీ హృద‌య‌పూర్వక ధ‌న్యవాదాలు తెలియ‌జేసిన డైరెక్టర్ తమ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉందన్నాడు.


Next Story

Most Viewed