Virata Parvam: ప్రేక్షకులకు గుడ్ న్యూస్ చెప్పిన 'విరాటపర్వం'టీమ్..

by Manoj |   (  Updated:2022-06-16 07:29:24  IST  )

Virata Parvam Movie Ticket Prices| వేణు ఉడుగుల దర్శకత్వంలో దగ్గుబాటి రానా, సాయి పల్లవి జంటగా నటిస్తున్న సినిమా 'విరాటపర్వం'. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, పాటలు సినిమాపై

Virata Parvam Movie Ticket Prices
X

దిశ, వెబ్‌డెస్క్: Virata Parvam Movie Ticket Prices| వేణు ఉడుగుల దర్శకత్వంలో దగ్గుబాటి రానా, సాయి పల్లవి జంటగా నటిస్తున్న సినిమా 'విరాటపర్వం'. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, పాటలు సినిమాపై, భారీ అంచనాలను పెంచేశాయి. చిత్రం ప్రమోషన్లలో భాగంగా బుధవారం హైదరాబాద్ లో విరాటపర్వం సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్ర బృందం. ఇక ఈ మూవీ రేపు గ్రాండ్‌గా విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా టికెట్ రేట్లను సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు మేకర్స్.

ఈ ప్రేమ కథను అందుబాటు ధరల్లోనే చూడండి అనే క్యాప్షన్‌తో తెలుగు రాష్టాల్లోని థియేటర్లలో టికెట్ రేట్లు ఎంత ఉంటాయో తెలిపింది. తెలంగాణలో సింగిల్ స్క్రీన్ రూ. 150, మల్టీప్లెక్స్ ధర రూ. 200 ఉండగా, ఏపీలో సింగిల్ స్క్రీన్ రూ. 147, మల్టీప్లెక్స్ రూ. 177 ఉంటాయని నిర్మాతలు తెలిపారు.

Next Story