కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి

by Ratna Kumari |

నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని గద్వాల మార్కెట్ యార్డ్ చైర్మన్ కుర్వ హనుమంతు డిమాండ్ చేశారు.

కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి
X

దిశ, కేటీదొడ్డి : నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని గద్వాల మార్కెట్ యార్డ్ చైర్మన్ కుర్వ హనుమంతు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, పార్టీ అధిష్ఠానం పిలుపు మేరకు గురువారం కేటీదొడ్డి మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా కుర్వ హనుమంతు మాట్లాడుతూ.. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఆరోపించారు.

ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని, బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే నీట్ బాధిత విద్యార్థులకు పూర్తి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేటీదొడ్డి మండలం మాజీ వైస్ ఎంపీపీ రామకృష్ణ నాయుడు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉరుకుందు, సర్పంచులు నారాయణ, పవన్ కుమార్, మహాదేవుడు, సీనియర్ నాయకులు బి.కొండన్న, నసీరుద్దీన్, మల్లాపురం తిమ్మప్ప, ఆర్.వీరన్న, జంగిలప్ప, నందిన్ని మహాదేవ, మెంటల్ వీరన్న, ఉలిగప్ప, సత్యనారాయణ, హెచ్. వీరేష్, హెచ్. తాయప్ప తదితరులు పాల్గొన్నారు.

Next Story