ఫోన్ వదిలేస్తే బహుమతిగా రూ. 10,000 నగదు.. ఓ టీచర్ మాస్టర్ ప్లాన్!

by Malleboina Mahesh |   (  Updated:2026-02-09 12:04:38  IST  )

ప్రస్తుత ప్రపంచంలో చిన్న పిల్లల నుంచి మూసళివాల్ల వరకు.. ఉదయం కళ్లు తెరిచింది మొదలు.. రాత్రి నిద్రపోయే వరకు స్మార్ట్ ఫోన్ లేనిదే ఎవరూ ఉండటం లేదు.

ఫోన్ వదిలేస్తే బహుమతిగా రూ. 10,000 నగదు.. ఓ టీచర్ మాస్టర్ ప్లాన్!
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుత ప్రపంచంలో చిన్న పిల్లల నుంచి మూసళివాల్ల వరకు.. ఉదయం కళ్లు తెరిచింది మొదలు.. రాత్రి నిద్రపోయే వరకు స్మార్ట్ ఫోన్ లేనిదే ఎవరూ ఉండటం లేదు. ఈ ప్రభావం ముఖ్యంగా చిన్ని పిల్లలు, విద్యార్థులపై భారీగా పడుతుంది. దీంతో విద్యార్థులు పుస్తకాల కంటే ఎక్కువగా స్మార్ట్‌ఫోన్ స్క్రీన్లకే అతుక్కుపోతున్నారు. కాగా ఈ తరాన్ని మార్చడానికి కేరళకు చెందిన ఓ టీచర్ విసిరిన 'ఛాలెంజ్' ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీంతో అంతా ఆ చాలేంజ్ పై సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చకు దారీ తీస్తున్నారు.

ఇంతకు ఆ టీచర్ సవాల్ ఎంటీ..

కేరళ రాష్ట్రంలోని మలప్పురం జిల్లాకు చెందిన ఓ ప్రభుత్వ టీచర్ అమృత తన విద్యార్థుల కోసం "నో ఫోన్ ఛాలెంజ్" ప్రారంభించారు. దీని నిబంధన చాలా సింపుల్: "వరుసగా 50 రోజులు స్మార్ట్‌ఫోన్ వాడకూడదు." ఎవరైతే ఈ నిబంధనను కచ్చితంగా పాటిస్తారో, వారికి ఛాలెంజ్ ముగిశాక రూ. 10,000 నగదు బహుమతి ఇస్తానని ప్రకటించారు. కాగా ఆ టీచర్ ఉద్దేశ్యం కేవలం ఫోన్ మాన్పించడం మాత్రమే కాదు. డిజిటల్ ప్రపంచం స్పీడులో పిల్లలు, విద్యార్థులు వారికి తెలియకుండానే మనం కోల్పోతున్న 'స్లో లివింగ్' (ప్రశాంత జీవనం) రుచిని విద్యార్థులకు చూపించడం. ఫోన్ పక్కన పెట్టిన ఈ 50 రోజుల్లో విద్యార్థులు ఏం చేయాలి? మళ్లీ కథల పుస్తకాలు చదవడం మొదలుపెట్టాలి. సాయంత్రం పూట మైదానాల్లో స్నేహితులతో కలిసి ఆడుకోవాలి. తల్లిదండ్రులతో నేరుగా ముచ్చట్లు చెప్పాలి.అలాగే విద్యార్థుల పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రకృతిని పరిశీలించాలి.

50 రోజులు ఫోన్ లేకుండా ఉండగలరా

నేటి ప్రపంచంలో 50 రోజులు ఫోన్ లేకుండా ఎవరైనా ఉండగలరా అనే అనుమానాలు నెలకొన్నాయి. అయితే మొదట్లో ఈ ఛాలెంజ్ కష్టమనిపించినా, నగదు బహుమతిపై ఆశతో, తమను తాము నిరూపించుకోవాలనే పట్టుదలతో వందలాది మంది విద్యార్థులు ఈ పోటీలో చేరారు. "పిల్లలు ఫోన్లకు బానిసలై కళ్లు పాడుచేసుకుంటున్నారని బాధపడే మాకు, ఈ టీచర్ దేవతలా కనిపించారు" అని అక్కడి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

విప్లవంలాగా 'నో ఫోన్' కల్చర్

ఎక్కడో కేరళలోని ఓ గ్రామంలో మొదలైన ఈ చిన్న ప్రయత్నం ఇప్పుడు మిగిలిన రాష్ట్రాలకు కూడా స్ఫూర్తినిస్తోంది. ఇది కేవలం పదివేల రూపాయల విషయం కాదు.. విద్యార్థుల ఏకాగ్రతను పెంచి, వారిని మళ్లీ నిజమైన ప్రపంచంతో కనెక్ట్ చేసే ఒక 'డిజిటల్ డిటాక్స్' ఉద్యమం. టెక్నాలజీ అనేది మన అవసరానికి ఉండాలి కానీ, మనల్ని శాసించేలా ఉండకూడదు. ఈ కేరళ టీచర్ వేసిన అడుగు మరిన్ని పాఠశాలలకు, మరిన్ని కుటుంబాలకు చేరువ కావాలని కోరుకుందాం.

వ్యభిచారం చేయాలని కోడలిని బలవంత పెట్టిన అత్త.. కొడుకు చూస్తుండగానే రోజూ

Next Story