- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వ్యభిచారం చేయాలని కోడలిని బలవంత పెట్టిన అత్త.. కొడుకు చూస్తుండగానే రోజూ..
డబ్బు సంపాదించడమే లక్ష్యంగా మనుషులు ఎంతకైనా దిగజారిపోతున్నారు. వావి వరుసలు మరిత అత్యంత కిరాతకంగా ప్రవర్తిస్తున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: డబ్బు సంపాదించడమే లక్ష్యంగా మనుషులు ఎంతకైనా దిగజారిపోతున్నారు. వావి వరుసలు మరిత అత్యంత కిరాతకంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే కర్ణాటక(Karnataka)లోని బీదర్ జిల్లా బసవకళ్యాణ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. 2022లో శేఖర్ పాటిల్‌తో అంజనాబాయి అనే మహిళకు పెళ్లి జరిగింది. వీరికి 11 నెలల బాబు ఉన్నాడు. అయితే.. పెళ్లయినప్పటి నుంచి అంజనాబాయిని అత్తింటివారు వేధింపులకు గురిచేస్తూనే ఉన్నట్టు సమాచారం. రోజూ కొడుతూ.. తిడుతూ చిత్రహింసలకు గురిచేసేవారని స్థానికులు చెబున్నారు. అత్తింటి వేధింపులు భరించలేక ఇటీవల అంజనాబాయి ఆత్మహత్య చేసుకుంది. తమ కూతురి ఆత్మహత్యకు అత్తింటి వారి వేధింపులే కారణమని అంజనాబాయి తల్లిదండ్రులు పోలసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టగా.. కోడలిని వ్యభిచార కూపంలోకి నెట్టి రోజూ చిత్రహింసలకు గురిచేసినట్లు తేలింది. నిత్యం కొడుతూ.. తిడుతూ.. అంజనాబాయితో వ్యభిచారం చేయించేవారని స్థానికులు పోలీసులకు చెప్పారు. దీంతో కేసు నమోదు చేసుకుని.. అంజనాబాయి భర్త శేఖర్ సహా మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






