'సస్పెండ్ చేయిస్తా.. నేను కేటీఆర్ పీఏను'.. ఇద్దరు వ్యక్తులు హల్ చల్..

by Vinod kumar |

దిశ, వేములవాడ: వేములవాడ రాజన్న దర్శనానికి - The two people who came to see Vemulawada Rajanna were Hull Chal

సస్పెండ్ చేయిస్తా.. నేను కేటీఆర్ పీఏను.. ఇద్దరు వ్యక్తులు హల్ చల్..
X

దిశ, వేములవాడ: వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు బయటికి వెళ్లే దారి నుంచి లోపలికి వచ్చే ప్రయత్నం చేయగా.. అక్కడ విధులు నిర్వహిస్తున్న కాంతారావు అను హోంగార్డు వారిని అడ్డుకున్నాడు. నివేదన సమయంలో దర్శనానికి అనుమతి ఉండదు ముఖ్య ద్వారం ద్వారా వెళ్ళండని సూచించాడు. దీంతో ఇద్దరు వ్యక్తులో ఒకరు నేను కేటీఆర్ పీఏ అని చెప్పి హోం గార్డ్ కాంతారావును సస్పెండ్ చేపిస్తామని బెదిరించారు. దీంతో అనుమానం వచ్చి ఆరా తీసిన ఆలయ ఈవో రమాదేవి ఐడి కార్డు చూపించమని అడగగా సదరు వ్యక్తులు వెంటనే అక్కడి నుండి జారుకున్నారు.

Next Story