- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
థ్రిల్లింగ్, క్రైమ్ ఎలిమెంట్స్‌తో ఆసక్తిని పెంచుతున్న ‘బ్లడ్ రోజస్’ ట్రైలర్
ధర్మ కీర్తి రాజు(Dharma Kirti Raja), అప్సర రాణి (Apsara Rani)ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బ్లడ్ రోజస్’.

దిశ, సినిమా: ధర్మ కీర్తి రాజు(Dharma Kirti Raja), అప్సర రాణి (Apsara Rani)ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బ్లడ్ రోజస్’. ఈ చిత్రాన్ని టీబీఆర్ సినీ క్రియేషన్స్ లో కె,నాగన్న, కె లక్ష్మమ్మ సమర్పణలో హరీష్ కమర్తి నిర్మాణంలో ఎంజిఆర్ దర్శకత్వంలో రాబోతుంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా ట్రైలర్ ను నటకిరీటి పద్మశ్రీ రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad)విడుదల చేశారు. ‘‘బ్లడ్ రోజస్ చిత్ర ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. ఫిబ్రవరి 6న విడుదల కాబోతున్న ఈ మూవీ విజయం సాధించాలని కోరుకుంటున్నాను. మంచి థ్రిల్లింగ్, క్రైమ్ ఎలిమెంట్స్‌తో వస్తోన్న ఈ సినిమాతో డైరెక్టర్ ఎంజిఆర్ , నిర్మాత హరీష్. కె కు అలాగే ఈ చిత్రంలో పనిచేసిన అందరూ ఆర్టిస్ట్స్ టెక్నీషియయన్స్‌కు మంచి గుర్తింపు రావాలని కోరుకుంటున్నా అన్నారు. కాగా.. ఈ సినిమాలో శ్రీలు, క్రాంతి కిల్లి, సుమన్, ఘర్షణ శ్రీనివాస్, టార్జన్, రాజేంద్ర, జూనియర్ రేలంగీ, జగదీశ్వరి, మణి కుమార్ , ధ్రువ, అనిల్, నరేంద్ర , ప్రగ్యా, నవిత, జబర్దస్త్ జీఎంఆర్, జబర్దస్త్ రాము, జబర్దస్త్ బాబు, ఈటీవీ జీవన్, మమత రెడ్డి, జ్యోతి, తదితరులు కీలక పాత్రలో నటించారు.






