- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nidhhi Agerwal : ఆస్టార్ హీరోతో గడిపిన సమయం ఎంతో ప్రత్యేకం.. షాకింగ్ కామెంట్స్
నిధి అగర్వాల(Nidhi Agarwal) ప్రస్తుతం వరుస విజయాలతో టాలీవుడ్‌లో దూసుకుపోతోంది.

దిశ, సినిమా: నిధి అగర్వాల(Nidhi Agarwal) ప్రస్తుతం వరుస విజయాలతో టాలీవుడ్‌లో దూసుకుపోతోంది. బ్యాక్ టు బ్యాక్ భారీ బడ్జెట్ చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును మరింత బలపరుచుకుంటోంది. గ్లామర్‌తో పాటు నటనకూ సమాన ప్రాధాన్యత ఇస్తూ, కమర్షియల్ సినిమాల్లోనూ తన పాత్రలకు ప్రత్యేకత తీసుకొస్తోంది. ఇటీవల ‘హరి హర వీరమల్లు’(Hari Hara Veera Mallu), ‘ది రాజాసాబ్’ (The Rajasaab)వంటి క్రేజీ ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాల్లో ఆమె లుక్స్, స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకోగా, స్టార్ హీరోల సరసన నిలబడి తనకంటూ స్పేస్‌ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా భారీ బడ్జెట్ చిత్రాల్లో భాగమవడం వల్ల ఆమె పాపులారిటీ దేశవ్యాప్తంగా మరింత పెరుగుతోందని చెప్పొచ్చు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిధి అగర్వాల్ ప్రభాస్‌పై ఆసక్తికర కామెంట్స్ చేసింది.
ప్రభాస్ నిజంగా చాలా చాలా మంచోడు… బంగారం లాంటి మనిషి అని ఆమె భావోద్వేగంగా చెప్పారు. సెట్స్‌లో ఆయనతో గడిపే సమయం తనకు ఎంతో ప్రత్యేకమని, షూటింగ్ గ్యాప్‌లలో సినిమాల గురించి మాత్రమే కాకుండా లైఫ్, క్రియేటివిటీ, మనసుకు ప్రశాంతత ఎలా దక్కాలనే విషయాలపై కూడా ప్రభాస్ మాట్లాడతారని తెలిపారు. ఆయన మాటల్లో ఎలాంటి ఆర్భాటం ఉండదని, చాలా సింపుల్‌గా కానీ లోతైన ఆలోచనలతో ఉంటారని చెప్పారు. ప్రభాస్ అసలు సోషల్ మీడియాకే దూరంగా ఉంటారని, అదే తనకు పెద్ద ఇన్స్పిరేషన్‌గా మారిందని ఆమె వెల్లడించారు. ఫోన్‌కి, సోషల్ మీడియాకు మనం ఎంతగా అలవాటు పడిపోయామో అప్పుడు అర్థమైందని, నిజంగా క్రియేటివ్‌గా ఉండాలంటే కొన్నిసార్లు సోషల్ మీడియాకు దూరంగా ఉండాల్సిందేనని ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నానని చెప్పారు. ప్రభాస్ వల్ల తానూ ట్విట్టర్‌ను ఫోన్ నుంచి డిలీట్ చేయాలనుకుంటున్నానని, మనసుకు నిశ్శబ్దం దొరికితే పనిలో ఇంకా మెరుగైన ఫలితం వస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రభాస్ లాంటి స్టార్ అయినా కూడా అంత సింపుల్‌గా ఉండటం తనకు ఎంతో ప్రేరణనిస్తుందని, ఆయన్ను చూసి మనిషిగా ఎలా ఉండాలో నేర్చుకుంటున్నానని ఆమె చెప్పడం చర్చకు దారితీస్తోంది.






