Priya Bhavani Shankar : రిలీజ్‌కు సిద్ధమైన సస్పెన్స్ థ్రిల్లర్..

by Mallepaka Hamsa |   (  Updated:2026-01-14 10:48:49  IST  )

ప్రియా భవానీ శంకర్ (Priya Bhavani Shankar)కీలక పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘హాట్‌స్పాట్–2 మచ్’(Hotspot–2 Much).

Priya Bhavani Shankar : రిలీజ్‌కు సిద్ధమైన సస్పెన్స్ థ్రిల్లర్..
X

దిశ, సినిమా: ప్రియా భవానీ శంకర్ (Priya Bhavani Shankar)కీలక పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘హాట్‌స్పాట్–2 మచ్’(Hotspot–2 Much). విగ్నేష్ కార్తీక్ (Vignesh Karthik)దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం, బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘హాట్‌స్పాట్’కు సీక్వెల్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో తంబి రామయ్య, ఆశ్విన్ కుమార్, ఆదిత్య భాస్కర్, రంజన తివారి వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌లతో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ మూవీకి తాజాగా మరో బిగ్ అప్‌డేట్ వచ్చింది. డబుల్ సస్పెన్స్‌తో ‘హాట్‌స్పాట్–2 మచ్’ జనవరి 23న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది అని మేకర్స్ పోస్టర్ ద్వారా ప్రకటించారు. దీంతో ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. సస్పెన్స్, ఎమోషన్స్, ఇంటెన్స్ డ్రామాతో ఈ సీక్వెల్ మరోసారి సంచలనానికి సిద్ధమవుతోంది.

Next Story