తల్లిని దారుణంగా హత్య చేసిన కొడుకు.. దాని కోసమే..!

by Satheesh |

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: తనకు సెల్ ఫోన్ కొనడం లేదన్న ఆగ్రహంతో కుమారుడు- latest Telugu news

తల్లిని దారుణంగా హత్య చేసిన కొడుకు.. దాని కోసమే..!
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: తనకు సెల్ ఫోన్ కొనడం లేదన్న ఆగ్రహంతో కుమారుడు తన తల్లిపై రోకలిబండతో దాడి చేసి హతమార్చిన ఘటన శుక్రవారం జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం షేర్ పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వరలక్ష్మి(52), వెంకటేశు దంపతులకు మహేష్, సాల్మన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో పెద్ద కుమారుడు మహేష్ గత కొన్ని నెలల నుండి తనకు సెల్ ఫోన్ కావాలని తల్లిదండ్రులను అడుగుతూ వస్తున్నాడు. మానసిక స్థితి అంతంతమాత్రంగానే ఉన్న మహేష్ శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన తల్లితో మరోసారి సెల్ఫోన్ విషయంపై గొడవ పడ్డట్లు సమాచారం. వివాదం ముదుదరడంతో ఇంట్లో ఉన్న రోకలిబండ తీసుకుని తల్లి తలపై బాదడంతో ఆమె అక్కడికక్కడే మరణించినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు.

Next Story