తండ్రి రాయితో కొట్టి చంపిన కొడుకు.. ఎందుకో తెలుసా..?

by Javid Pasha |

దిశ, పెద్దేముల్‌ : తల్లిని తరచూ వేధిస్తున్న తండ్రిపై కొడుకు రాయితో దాడి చేసిన ఘటన వికారాబాద్ జిల్లాలోని.. Latest Telugu News..

తండ్రి రాయితో కొట్టి చంపిన కొడుకు.. ఎందుకో తెలుసా..?
X

దిశ, పెద్దేముల్‌ : తల్లిని తరచూ వేధిస్తున్న తండ్రిపై కొడుకు రాయితో దాడి చేసిన ఘటన వికారాబాద్ జిల్లాలోని పెద్దెముల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై జి.నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. బేగరి ఈరప్ప(45), సునీతలకు ఇద్దరు కుమారులు. ఈరప్ప వృత్తిరీత్యా వ్యవసాయం పనులు చేసుకుంటూ ఉండేవాడు. అతడు తరచూ భార్యను హింసిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి కూడా ఇంటి దగ్గర వారి కుమారుల ముందే భార్యను వేధించాడు. కుమారులు శ్రీకాంత్, జైపాల్‌లు ఎంతగా సర్దిచెప్పినా వీరప్ప వినిపించుకోలేదు.

దీంతో చిన్న కుమారుడు జైపాల్ గ్రామంలోని పెద్దలను తీసుకురావడానికి వెళ్లాడు. మరలా ఈరప్ప తన భార్య సునీతను కొడుతుండగా ఈరప్ప పెద్ద కుమారుడు చూసి తట్టుకోలేకపోయాడు. తీవ్ర ఆవేశానికి గురైన శ్రీకాంత్ తన తండ్రిని చెంపమీద కొట్టగా ఆయన కిందపడిపోయాడు. వెంటనే శ్రీకాంత్ పక్కనే ఉన్న రాయిని తీసుకుని తన తండ్రి ఈరప్ప తలపైన కొట్టాడు. దాంతో ఈరప్ప తలకు బలమైన గాయమైంది.

వెంటనే ఈరప్ప తల్లి చంద్రమ్మ తన గ్రామానికి చెందిన శ్రీనివాస్ ఆటోలో చికిత్స నిమిత్తం తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. గాయాలతో ఉన్న ఈరప్పను పరిశీలించిన డాక్టర్ అప్పటికే అతడు మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి తల్లి చంద్రమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగరాజు తెలిపారు.

Next Story