ఎస్‌ఐఆర్ గణనను త్వరితగతిన పూర్తి చేయాలి

by Ratna Kumari |   (  Updated:2026-07-14 11:46:51  IST  )

ఎస్‌ఐఆర్ సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని, ప్రతి అర్హ కుటుంబం గణనలో తప్పనిసరిగా భాగస్వాములు కావాలని నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు.

ఎస్‌ఐఆర్ గణనను త్వరితగతిన పూర్తి చేయాలి
X

దిశ, ఖిల్లా ఘణపురం : రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర ఇంటింటి సర్వే (SIR) కార్యక్రమాన్ని బీఎల్‌వోలు, రెవెన్యూ అధికారులు త్వరితగతిన పూర్తి చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు. ఖిల్లా ఘణపురం మండల కేంద్రంతో పాటు సోలీపూర్ గ్రామంలో నిర్వహిస్తున్న ఎస్‌ఐఆర్ సర్వే కార్యక్రమాన్ని ఆయన పార్టీ కార్యకర్తలతో కలిసి పరిశీలించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి అర్హ కుటుంబం ఎస్‌ఐఆర్ గణనలో తప్పనిసరిగా భాగస్వామ్యం కావాలని కోరారు.

సరైన వివరాలతో గణన ఫారాలను పూర్తి చేసి సంబంధిత అధికారులకు అందజేయాలని సూచించారు. అర్హులెవరూ సర్వేకు దూరం కాకుండా అధికారులు, సిబ్బంది సమన్వయంతో సర్వేను వేగంగా పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మారెడ్డి, వైస్ చైర్మన్ బాలీశ్వర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు రాళ్ల కృష్ణయ్య, పార్టీ ప్రధాన కార్యదర్శి పురేందర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సామ్ నాయక్, సర్పంచ్ బాలరాజు, మాజీ సర్పంచులు పీనా నాయక్, కృష్ణయ్య గౌడ్, వెంకటయ్య, బుచ్చిబాబు గౌడ్, పార్టీ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Next Story