టాలీవుడ్ రౌడీ స్టార్‌పై మనసు పారేసుకున్న సెన్సేషనల్ బ్యూటీ.. చర్చనీయాంశంగా మారిన కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2026-01-18 05:13:30  IST  )

‘ధురంధర్’(Dhurandhar) సినిమాతో హీరోయిన్‌గా మారిన సారా అర్జున్(Sara Arjun) మొదటి మూవీతోనే సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది.

టాలీవుడ్ రౌడీ స్టార్‌పై మనసు పారేసుకున్న సెన్సేషనల్ బ్యూటీ.. చర్చనీయాంశంగా మారిన కామెంట్స్
X

దిశ, సినిమా: చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి వచ్చి తన నటనతో అందరినీ మైమరిపించింది. ఇక ‘ధురంధర్’(Dhurandhar) సినిమాతో హీరోయిన్‌గా మారిన సారా అర్జున్(Sara Arjun) మొదటి మూవీతోనే సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించడంతో పాటు.. భారీ కలెక్షన్లతో పలు రికార్డులు బద్దలు కొడుతోంది. ఈ మూవీ వచ్చి ఆరు వారాలైనప్పటికీ బాగానే రాబడుతోంది. ఇక సెన్సేషనల్ బ్యూటీగా మారిన సారా అర్జున్ తెలుగులో వరుస అవకాశాలు దక్కించుకుంటోంది. త్వరలో ‘యుఫోరియా’ (Euphoria)సినిమాతో ప్రేక్షకులను అలరించబోతుంది. గుణశేఖర్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో గౌతమ్ వాసుదేవ్ మీనన్, భూమిక, సారా అర్జున్ కీలక పాత్రలో నటించారు.

తాజాగా, మూవీ మేకర్స్ ట్రైలర్ విడుదల చేయగా.. ఇందులో పాల్గొన్న సారా అర్జున్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. టాలీవుడ్ హీరోల్లో తనకు విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) అంటే అత్యంత ఇష్టమని.. ఆయనే తన ఫేవరెట్ హీరో అని అందరినీ ఆశ్చర్యపరిచింది. సారా అర్జున్ కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. సెన్సేషనల్ బ్యూటీ రౌడీ స్టార్ పేరు చెప్పడంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అంతేకాకుండా వీరిద్దరి కాంబోలో ఓ మూవీ కచ్చితంగా వస్తుందని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సారా అర్జున్ ‘యుఫోరియా’తో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రం ఫిబ్రవరి 6న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఇది కనుక హిట్ అయితే మాత్రం సారా అర్జున్ టాలీవుడ్‌లో పాగా వేయడం ఖాయమని అంతా అంటున్నారు. విజయ్ దేవరకొండతో కూడా నటిస్తుందని.. చర్చించుకుంటున్నారు.

Read More..

ఆ స్టార్ హీరోయిన్ భర్తపై ప్రభాస్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. చిన్నప్పటినుంచే మేమిద్దరం అంటూ..

Next Story