- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ స్టార్ హీరోయిన్ భర్తపై ప్రభాస్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. చిన్నప్పటినుంచే మేమిద్దరం అంటూ..
యంగ్ బ్యూటీ మాళవిక మోహనన్(Malavika Mohanan) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ‘పట్టంపోలే’(Pattampole) మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది రీసెంట్‌గా ప్రభాస్(Prabhas) సరసన ‘రాజాసాబ్’(Raja Saab) మూవీలో నటించి మెప్పించింది.

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ బ్యూటీ మాళవిక మోహనన్(Malavika Mohanan) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ‘పట్టంపోలే’(Pattampole) మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది రీసెంట్‌గా ప్రభాస్(Prabhas) సరసన ‘రాజాసాబ్’(Raja Saab) మూవీలో నటించి మెప్పించింది. మారుతి(Maruti) దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఇందులో యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్(Nidhi Agarwal), రిద్ధి కుమార్(Ridhi Kumar)లు కూడా హీరోయిన్లుగా నటించారు.
ప్రస్తుతం మాళవిక కార్తీ(Karthi) సరసన ‘సర్దార్-2’(Sardar-2) మూవీలో యాక్ట్ చేస్తుంది. ఈ సినిమా ఈ ఇయర్‌లోనే రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మాళవిక స్టార్ హీరో విక్కీ కౌశల్(Vicky Kaushal) గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఆమె మాట్లాడుతూ.. ‘నాకు ఊహ తెలిసినప్పటి నుంచే విక్కీతో పరిచయం ఉంది. అప్పటి నుంచి మా స్నేహం కొనసాగుతూనే ఉంది.
చిన్నప్పుడు మా అమ్మ చేసే మలయాళీ వంటల్ని విక్కీ ఎంతో ఇష్ట పడేవాడు. అందుకే, తరచుగా మా ఇంటికి భోజనానికి వచ్చేవాడు. ఆ సమయంలో ఇద్దరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ, భోజనం చేసేవాళ్లం. విక్కీ బాగా డాన్స్ చేస్తాడు. వేడుక ఏదైనా డ్యాన్స్‌తో అదరగొట్టేవాడు. మేమిద్దరం తరచుగా కలుస్తూనే ఉంటాము’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
Read More..






