- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ధనుష్‌తో మృణాల్ పెళ్ళి.. అసలు నిజమేంటో తెలిస్తే ఫ్యూజులు ఎగిరి పోవాల్సిందే..(పోస్ట్)
స్టార్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur), కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) లవర్స్ డే నాడు (ఫిబ్రవరి 14) మ్యారేజ్ చేసుకోబోతున్నట్లు గత కొన్ని రోజులుగా ఓ పుకారు షికారు చేస్తున్న సంగతి తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur), కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) లవర్స్ డే నాడు (ఫిబ్రవరి 14) మ్యారేజ్ చేసుకోబోతున్నట్లు గత కొన్ని రోజులుగా ఓ పుకారు షికారు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి కారణం ఈ ఇద్దరూ కలిసి బాలీవుడ్ మీడియా ముందు చెట్టాపట్టాలు వేసుకుని తిరిగడమే. అసలు సంబంధమే లేని సినిమా ఫంక్షన్‌లో ధనుష్ కోసం మృణాల్ సందడి చేసింది. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
అయితే ఈ ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని మృణాల్ టీమ్ స్పందించింది. వచ్చే నెలలో మృణాల్ మ్యారేజ్ చేసుకుంటుంది అంటూ వస్తున్న వార్తలు కేవలం రూమర్సేనని హీరోయిన్ టీమ్ కొట్టి పారేసింది. ఫిబ్రవరిలో ఆమె నటించిన సినిమా రిలీజ్ ఉంది, మార్చిలో మరో తెలుగు మూవీ వస్తోంది. సినిమాలతో అంత బిజీగా ఉంటే ఇప్పుడింత సడెన్‌గా పెళ్లెందుకు చేసుకుంటుందని ఆమె టీమ్ చెప్పింది. తనకసలు ఇప్పట్లో వివాహం చేసుకోవాలన్న ఆలోచనే లేదని, అనవసరంగా దీన్ని ఎవరు సృష్టించారని మండిపడింది. దీంతో మృణాల్ పెళ్లి రూమర్స్‌కు ప్రస్తుతానికి ఫుల్ స్టాప్ పడ్డట్లే అనిపిస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
Read More..
63 ఏళ్లు వచ్చినా ఎఫైర్లు పెట్టుకున్నాడు.. ఇక నైనా బుద్ధి మార్చుకో.. గోవాందాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన భార్య






