- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
63 ఏళ్లు వచ్చినా ఎఫైర్లు పెట్టుకున్నాడు.. ఇక నైనా బుద్ధి మార్చుకో.. గోవిందకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన భార్య
బాలీవుడ్‌లో ఒకప్పుడు కామెడీకి, ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన హీరో గోవింద(Govinda).. ఇప్పుడు తన పర్సనల్ లైఫ్ కారణంగా వార్తల్లో నిలిచారు.

దిశ, సినిమా: బాలీవుడ్‌లో ఒకప్పుడు కామెడీకి, ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన హీరో గోవింద(Govinda).. ఇప్పుడు తన పర్సనల్ లైఫ్ కారణంగా వార్తల్లో నిలిచారు. ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆయన భార్య సునీత అహుజా(Sunita Ahuja) సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో జరిగిన వివాదాలు లేదా పాత విషయాలను తవ్వుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని, ప్రస్తుతం తన దృష్టంతా పిల్లల భవిష్యత్తుపైనే ఉందని ఆమె స్పష్టం చేశారు. అలాగే గోవింద ఎఫైర్స్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది. నీకు పెళ్లికి ఎదిగిన కూతురు టీనా ఉంది. కెరీర్ నిర్మించుకోవాల్సిన కొడుకు యష్ ఉన్నాడు. అయినా నీ బుద్ధి మారలేదు. నిన్ను నేను ఎప్పటికీ క్షమించను. నేపాల్‌కి చెందిన బిడ్డని.. నేను గనుక (ఖుక్రీ) నేపాలీ కత్తి బయటకు తీశానంటే అందరి పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండు అని గోవిందాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.
ఈ ఇంటర్వ్యూలో గోవింద వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రశ్నలు ఎదురైనప్పుడు కూడా సునీత ఎక్కడా తడబడకుండా సమాధానమివ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మనుషులు అన్నాక తప్పులు జరగడం సహజమని, కానీ వయసు పెరిగే కొద్దీ పరిణతి రావాలని ఆమె అభిప్రాయపడ్డారు. తన పిల్లల గురించి ఒక్కరోజు కూడా ఫోన్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేసింది. అందుకే అసలు నువ్వు తండ్రివేనా? అని గోవిందను ప్రశ్నించినట్లు చెప్పింది. ముఖ్యంగా ఒక తండ్రిగా పిల్లల పట్ల బాధ్యతగా ఉండాల్సిన అవసరాన్ని ఆమె పరోక్షంగా గుర్తు చేయడంతో బాలీవుడ్ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఇది కేవలం భార్యాభర్తల మధ్య జరిగిన సాధారణ సంభాషణేనా.. లేక గోవిందాలో మార్పు కోరుతూ ఆమె ఇచ్చిన హెచ్చరికనా? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఏదేమైనా గోవింద ఫ్యామిలీలో జరుగుతున్న ఈ పరిణామాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
Read More..






