- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేవల్లి యూనియన్ బ్యాంకులో బయటి,మధ్యవర్తుల పాగ
రేవల్లి యూనియన్ బ్యాంక్లో ఖాతాదారుల్లో అభద్రతభావం వ్యక్తం చేస్తూ చర్చ జరుగుతుంది.

దిశ రేవల్లి : ప్రజల నమ్మకానికి భద్రతకు, ఆర్థిక క్రమశిక్షణకు, ప్రజలకు ఖాతా దారులకు ఆర్థిక భరోసా, ఆర్థిక సమగ్రతకు, విశ్వాసం, దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక బ్యాంకులు,అలాంటిది ప్రజల సొమ్ముకు భద్రత కల్పించాల్సిన రేవల్లి యూనియన్ బ్యాంక్ లో అందుకు భిన్నగా ఉండడంతో ఖాతాదారుల్లో అభద్రతభావం వ్యక్తం చేస్తూ చర్చ జరుగుతుంది. ఈ బ్యాంక్ శాఖా అధికారులు మౌనముద్ర వహించగా ప్రవేటు మరియు బయటి వ్యక్తులు బ్యాంకులో తిష్టవేసి విధుల నిర్వహణలో, ఖాతాదారులకు సేవల అందజేత, పంట రుణాల పునరుద్ధరణ చేతివాటం బయట వ్యక్తులు తాత్కాలిక సిబ్బంది పాత్ర అధికం కావడం తో ఖాతాదారులు, స్థానికులు ఆందోళన వ్యక్తంచేస్తూ మండలంలో చర్చనీయాంశంగా మారి ఖాతాదారుల్లో అనుమానాలు రేకిత్తిస్తున్నాయి.
తాత్కాలిక సిబ్బంది బ్యాంకు ప్రాంగణంలోని గదులను ఊడ్చడం, తుడవడం, పరిశుభ్రత నిర్వహించాలని నిభందనలు చెబుతుండగా ఈ బ్యాంక్ శాఖలో మాత్రం నగదు (Cash) నిర్వహణ,కస్టమర్ల బ్యాంకింగ్ లావాదేవీలకు సంబంధించిన పనులు.పాస్‌బుక్ ఎంట్రీలు, వౌచర్లు, రికార్డులు నిర్వహించడం.కంప్యూటర్ ఆపరేషన్,ఏటీఎం లో క్యాష్ పెట్టడం తీయడం.నేరుగా క్యాష్ కౌంటర్ నుండి ఖాతాదారులకు నగదును పంపిణీ డిపాజిట్, బ్యాంకుల్లో గోల్డ్ బంగారు అభరణాలపై లోను తీసుకున్న విలువైన వస్తువులను సేఫ్టీ లాకర్ నుండి తీయడం పెట్టడం చేస్తుంటారు వీళ్ళు,అధికారం కలిగిన బ్యాంకు ఉద్యోగులు మాత్రమే నిర్వహించాల్సినవి కాని ఇక్కడి శాఖలో తాత్కాలిక బయటికి వ్యక్తులతో చేయిస్తున్నారు.ఈ బ్యాంక్ రేవల్లి శాఖా అధికారులు, బ్యాంకులో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ ఈ వ్యవహారాలపై సంబంధిత అధికారులు దృష్టి సారించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశ్వాసానికి ప్రతీకలైన బ్యాంకులో భద్రతా ప్రమాణాలు, బాధ్యతల కేటాయింపు, అంతర్గత నియంత్రణలు కచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.
ప్రజల విలువైన ఆస్తులు బ్యాంకులపై నమ్మకంతోనే అప్పగిస్తుంటారు.నిబంధనలు ఉల్లంఘించబడుతున్నాయనే అనుమానాలు కూడా ప్రజల్లో ఆందోళన కలిగిస్తాయని స్థానికులు పేర్కొంటున్నారు.బ్యాంక్ సేవలకోసం బ్యాంకులో అడుగుపెట్టిన ఖాతాదారులకు సిబ్బందే బయటి వ్యక్తులను సంప్రదించాలని బ్యాంకు పనులు సక్కదిద్దుకోవాలని సూచిస్తుంటారు, దీంతో ఖాతాదారుడు బయటి వ్యక్తులను కలవాల్సిందేననే భావనతో ఉన్నారు.
బ్యాంకు శాఖలో ఏర్పాటు చేసిన సీసీటీవీ పర్యవేక్షణ వ్యవస్థ (CCTV Surveillance System) ద్వారా విధుల నిర్వహణ, నగదు లావాదేవీలు, భద్రతా ప్రక్రియలను ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించే అవకాశం ఉంది కాని బ్యాంక్ ఉన్నతాదికారులు స్థానిక అధికారులు పట్టించుకోక పోవడంతో బయటి వ్యక్తులు బ్యాంకులో తిష్ట వేశారని స్థానికుల ఆరోపిస్తున్నారు, సంభంధిత అధికారులు ఇప్పటికైనా సీసీటీవీ ఫుటేజ్‌ను,లావాదేవీల రికార్డులు మరియు ఇతర ఆధారాలను పరిశీలించి సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన కఠినచర్యలు తీసుకోవాలని ఖాతాదారులు, ప్రజలు కోరుతున్నారు.






