- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటు హక్కే బలమైన పునాది : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటు హక్కే బలమైన పునాది అని, అర్హులైన ప్రతి ఓటరు తమ ఓటు హక్కును పరిరక్షించుకునేందుకు తప్పనిసరిగా ఎస్‌ఐఆర్ ప్రక్రియలో పాల్గొని పూర్తి వివరాలను నమోదు చేసుకోవాలని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పిలుపునిచ్చారు.

దిశ, రామచంద్రాపురం : ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటు హక్కే బలమైన పునాది అని, అర్హులైన ప్రతి ఓటరు తమ ఓటు హక్కును పరిరక్షించుకునేందుకు తప్పనిసరిగా ఎస్‌ఐఆర్ ప్రక్రియలో పాల్గొని పూర్తి వివరాలను నమోదు చేసుకోవాలని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని ఏలియన్స్ స్పేస్ స్టేషన్ అపార్ట్‌మెంట్ సమీపంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సోమిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్‌ఐఆర్ అవగాహన ర్యాలీతో పాటు ప్రచార రథాన్ని ఎమ్మెల్యే జీఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి అర్హుడైన ఓటరు జాబితాలో తన పేరు సక్రమంగా ఉండేలా చూసుకోవడం ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధమైన బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజల్లో ఎలాంటి అపోహలు లేకుండా, ప్రతి ఒక్కరికీ ఎస్‌ఐఆర్ ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పించేందుకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గవ్యాప్తంగా అవగాహన సదస్సులు, ర్యాలీలు, ప్రచార రథాలు, ఇంటింటి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కో-ఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రాములు గౌడ్, బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు దేవేందర్ యాదవ్, మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






