- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ సంచలన డిమాండ్
కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో తీవ్ర అవకతవకలు, అక్రమాలు చోటుచేసుకున్నాయని, దీనికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ డిమాండ్ చేశారు. ..

దిశ, ఏపీ బ్యూరో: కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో తీవ్ర అవకతవకలు, అక్రమాలు చోటుచేసుకున్నాయని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆరోపించారు. దీనికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం డీఎస్సీ నిర్వహణలో నిబంధనలను పక్కనబెట్టి, గోప్యతను దెబ్బతీస్తూ అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టారని ఆరోపించారు. కేంద్రంలో నీట్ వ్యవహారంలో అనుసరించిన తీరుగానే, ఇక్కడ కూడా లోకేష్ రాజీనామా చేసి, డీఎస్సీ స్కామ్‌పై స్వతంత్ర సంస్థ అయిన సిబిఐ తో పూర్తిస్థాయి విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
‘‘డీఎస్సీ వ్యవహారంలో కాన్ఫిడెన్షియాలిటీ (గోప్యత), ట్రాన్స్పరెన్సీ (పారదర్శకత), అడ్మినిస్ట్రేటివ్ మిషనరీ న్యూట్రాలిటీ అసలు ఎక్కడా కనపడలేదు. ప్రశ్నాపత్రం తయారు చేసే వ్యవస్థ, పరీక్షలు నిర్వహించే వ్యవస్థ రెండూ వేర్వేరుగా ఉండాలి. కానీ, ఈ రెండింటినీ కలిపేయడం వల్ల గోప్యత పూర్తిగా లేకుండా పోయింది. ఎవరైతే ప్రశ్నపత్రాలు అప్‌లోడ్ చేసిన వారికే ఫస్ట్ ర్యాంకులు రావడం దేనికి సంకేతం.’’ అని మాజీ మంత్రి ప్రశ్నించారు. డీఎస్సీ అక్రమాలపై తక్షణ ఆ శాఖ మంత్రి నారా లోకేష్ స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.






