- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శేష జీవితం ఆనందోత్సాహాలతో సుఖమయం కావాలి
సమాజానికి ఎంతోకాలం నిజాయితీగా సేవలందించిన పోలీసు అధికారులు పదవీ విరమణ అనంతరం ఆరోగ్యంగా, ఆనందోత్సాహాలతో శేష జీవితాన్ని గడపాలని గోదావరిఖని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) మడత రమేష్ ఆకాంక్షించారు.

దిశ, యైటింక్లయిన్ కాలనీ : సమాజానికి ఎంతోకాలం నిజాయితీగా సేవలందించిన పోలీసు అధికారులు పదవీ విరమణ అనంతరం ఆరోగ్యంగా, ఆనందోత్సాహాలతో శేష జీవితాన్ని గడపాలని గోదావరిఖని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) మడత రమేష్ ఆకాంక్షించారు. గోదావరిఖని టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన మహమ్మద్ అహ్మదుల్లాకు స్థానిక సింగరేణి కమ్యూనిటీ హాల్‌లో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏసీపీ మాట్లాడారు. పోలీసు శాఖలో క్రమశిక్షణ, నిబద్ధత, సేవాభావంతో విధులు నిర్వహించి ప్రజల మన్ననలు పొందడం గొప్ప విషయమన్నారు. పోలీసు ఉద్యోగం ఎంత బాధ్యతాయుతమైనదో, అదే స్థాయిలో పదవీ విరమణ తర్వాత కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమని సూచించారు. ఉద్యోగ జీవితంలో సంపాదించిన మంచి పేరు, సేవా తత్వం సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పదవీ విరమణ పొందిన ఎస్‌ఐ మహమ్మద్ అహ్మదుల్లాను శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. సహచర పోలీసు అధికారులు, సిబ్బంది ఆయన అందించిన సేవలను కొనియాడుతూ శేష జీవితం సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గోదావరిఖని టూ టౌన్ సీఐ ప్రసాద్‌రావు, వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి, కమాన్‌పూర్ ఎస్‌ఐ ప్రసాద్, పోలీసు సిబ్బంది, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.






