- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సౌమ్య చికిత్స బాధ్యత ప్రభుత్వానిదే.. మంత్రి దామోదర రాజనర్సింహ
నిజామాబాద్ జిల్లాలో గంజాయి స్మగ్లర్ల ఘాతుకానికి గురై, హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఇవాళ ఉదయం పరామర్శించారు.

దిశ, వెబ్‌డెస్క్: నిజామాబాద్ జిల్లాలో గంజాయి స్మగ్లర్ల ఘాతుకానికి గురై, హైదరాబాద్‌లోని నిమ్స్ (NIMS) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య (Sowmya)ను రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Damodara Rajanarsimha) ఇవాళ ఉదయం పరామర్శించారు. సౌమ్య ఆరోగ్య పరిస్థితిని నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, ఇతర వైద్య బృందంతో చర్చించి మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సౌమ్య తల్లి చంద్రకళ, సోదరుడు శ్రావణ్‌ను కలిసి ఓదార్చారు.
ఈ సందర్భంగా మీడియాతో మంత్రి దామోదర రాజనర్సింహ.. విధి నిర్వహణలో ఉన్న మహిళా కానిస్టేబుల్‌కు ఇలా జరగడం అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సౌమ్య పూర్తిగా కోలుకునే వరకూ మెరుగైన వైద్య సేవలు అందించే పూర్తి బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందని హామీ ఇచ్చారు. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, నిందితులపై ఇప్పటికే హత్యాయత్నం కేసు నమోదు చేశామని తెలిపారు. రాష్ట్రంలో గంజాయి, మత్తు పదార్థాల వినియోగాన్ని పూర్తిగా అరికట్టడమే ప్రభుత్వ లక్ష్యమని, అందు కోసం ఎక్సైజ్, పోలీస్ శాఖలు తీవ్రంగా కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు. సౌమ్య కండీషన్ ప్రస్తుతం క్రిటికల్‌గా ఉన్నప్పటికీ, నిన్నటి కంటే మెరుగుపడిందని నిమ్స్‌లోని నిపుణులైన వైద్యులు ఆమెకు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు.






