- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘రాకాస’ గ్లింప్స్ విడుదలకు ముహూర్తం ఫిక్స్.. క్యూరియాసిటీ పెంచుతున్న పోస్టర్
మెగా డాటర్ నిహారిక( Niharika)కొణిదెల తన సొంత నిర్మాణ సంస్థ 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' ద్వారా చిత్ర పరిశ్రమలో నిర్మాతగా తనదైన ముద్ర వేస్తున్నారు.

దిశ, సినిమా: మెగా డాటర్ నిహారిక( Niharika)కొణిదెల తన సొంత నిర్మాణ సంస్థ 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' ద్వారా చిత్ర పరిశ్రమలో నిర్మాతగా తనదైన ముద్ర వేస్తున్నారు. ఇప్పటికే ఆమె బ్యానర్‌లో వచ్చిన ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించి, భారీ వసూళ్లను రాబట్టింది. ఆ ఉత్సాహంతోనే నిహారిక ఇప్పుడు తన రెండో ప్రాజెక్ట్ ‘రాకాస’(raakasa)ను పట్టాలెక్కించారు. జీయో స్టూడియోస్ భాగస్వామ్యంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రంలో యంగ్ హీరో సంగీత్ శోభన్(Sangeeth Shobhan), నయన్ సారిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్ ప్రేక్షకుల్లో మంచి హైప్‌ను క్రియేట్ చేయగా, తాజాగా చిత్ర బృందం ఒక సాలిడ్ అప్‌డేట్‌ను ఇచ్చింది.
నేడు (జనవరి 23) సాయంత్రం 6:19 గంటలకు ‘రాకాస’ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ఓ పోస్టర్‌ను షేర్ చేశారు. ఇక ఈ పోస్టర్‌లో హీరో సంగీత్ శోభన్ చీకటి నిండిన గుహలో కాగడా పట్టుకుని ఏదో వెతుకుతున్నట్లు కనిపిస్తుండటం సినిమాలోని మిస్టరీని సూచిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ‘కమిటీ కుర్రోళ్లు’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత నిహారిక నిర్మిస్తున్న సినిమా కావడంతో, ‘రాకాస’ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు. సంగీత్ శోభన్ మార్క్ కామెడీతో పాటు, ఇందులో ఏదో ఫాంటసీ లేదా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉండబోతున్నట్లు టాక్.






