- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏప్రిల్ 10 నుంచి అసలైన సమ్మర్..! ప్రతాపం చూపించనున్న సూర్యుడు
ఏప్రిల్ 10 నుండి రాష్ట్రవ్యాప్తంగా 'అసలైన వేసవి' ప్రారంభం కాబోతోందని వాతావరణ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో ఇక ఎండల తీవ్రత భారీగా పెరగనుంది. గత కొద్దిరోజులుగా అక్కడక్కడా కురిసిన జల్లుల వల్ల వాతావరణం కొంత ప్రశాంతంగా ఉన్నప్పటికీ, ఏప్రిల్ 10 నుండి రాష్ట్రవ్యాప్తంగా 'అసలైన వేసవి' (Peak Summer) ప్రారంభం కాబోతోందని వాతావరణ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. రాబోయే పది రోజుల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలపై భానుడు ప్రతాపం చూపనున్నాడు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
ముఖ్యంగా సింగరేణి ప్రాంతాల్లో ఎండలు భీకరంగా ఉండనున్నాయని, 41°C నుండి 43°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని నిపుణులు పేర్కొన్నారు. ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కూడా ఎండల ప్రభావం గట్టిగానే ఉండబోతోంది. నగరంలో 'హీట్ ఐలాండ్' ప్రభావంతో ఉష్ణోగ్రతలు 40°C మార్కును చేరుకోనున్నాయని సమాచారం. అయితే తీవ్రమైన వేడి కారణంగా స్థానికంగా ఏర్పడే అల్పపీడన ద్రోణుల వల్ల అక్కడక్కడా ఉరుములతో కూడిన వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉంది. అయితే, ఈ వర్షాలు కేవలం కొద్దిసేపు మాత్రమే ఉపశమనాన్ని ఇస్తాయని, భూమిలో వేడి పెరగడం వల్ల వర్షం పడిన తర్వాత ఉక్కపోత మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.






