ప్రభుత్వ వైద్యం.. అందని దైన్యం!

by Jakkula.Mamatha |

ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది.

ప్రభుత్వ వైద్యం.. అందని దైన్యం!
X

దిశ,నల్గొండ బ్యూరో: ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. కానీ వనరులను వసతులను వాడుకొని ప్రజలకు అందించే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం పోతుంది. మిర్యాలగూడ లో ఏరియా ఆస్పుత్రిలో అధికారులు ,సిబ్బంది పనితీరు ప్రజలకు ఇబ్బందికరంగా మారుతుంది.

పర్యవేక్షణ నిర్లక్ష్యం..

నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిలో అధికారుల పర్యవేక్షణ లోపంతో ప్రజలకు సరైన వైద్యం అందడం లేదు. వంద పడకలు కలిగిన ఈ ఆస్పత్రిలో వైద్యులు సమయపాలన పాటించడం లేదు. కొందరు విధులకు గైర్హాజరు అవుతున్నారు. కొన్ని విభాగాల వైద్యాధికారులు నామమాత్రంగా హాజరై వెళ్లిపోతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఆస్పత్రిలో పని చేస్తున్న డాక్టర్లకు బయట ప్రైవేటు ఆస్పత్రులు ఉన్నాయని విమర్శలు ఉన్నాయి. వీరంతా కూడా సక్రమంగా సమయపాలన పాటించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. దంత విభాగంతో పాటు మరికొందరు సోమవారం రాలేదని తెలిసింది. వీరు ఓపి నిర్వహించే గదులకు తాళాలు వేసి దర్శనమిచ్చాయి.అయితే ఇద్దరు ముగ్గురు కలిసి ఓకే గదిలో ఓపీ చూస్తున్నారు.వైద్యాధికారుల పనితీరు పై పర్యవేక్షణ కరువైందని ప్రజలు ఆరోపిస్తున్నారు.

రోగులకు అసౌకర్యాలు..

కోట్ల రూపాయలు వెచ్చించిన ఏరియా ఆస్పత్రిలో ఓపి వద్ద ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. వైద్య సేవల కోసం వచ్చే ప్రజలకు క్యూ లైన్ వద్ద సరియైన సదుపాయాలు లేవు. ఓపీ నమోదులో సిబ్బంది ఆలసత్వం వహిస్తున్నారని ప్రజలు పేర్కొంటున్నారు. దీనివల్ల లైన్‌లో ఎక్కువ సమయం నిలబడాల్సి వస్తుందని రోగులు ఆరోపిస్తున్నారు. కొంతమంది రోగులకు కనీస సౌకర్యాలు కల్పించేదు. ప్రతి రోజు వందల సంఖ్యలో ప్రజలు వస్తున్నప్పటికి ఓపీ క్యూ వద్ద పది మంది కుర్చునే కుర్చీలు ఉన్నాయి. దీనివల్ల రోగులు ఇబ్బందులు పడుతున్నారు.అంతేకాకుండా ఫ్యాన్ ల సౌకర్యం కూడా లేదు.ఎలక్ట్రిక్ మరమ్మతుల పేరుతో విద్యత్ తీగలు లాగి వదిలేశారు.మొదటి అంతస్తులో రోగులకు బెడ్ లను వరండలోనే వేసి చికిత్స చేస్తున్నారు.దీనిలవన వస్తూ వేళ్లే రోగులకు, రోగుల అటెండెంట్లకు అసౌకర్యంగా ఉంటుందని ప్రజలు వాపోతున్నారు.

ఎవరూ డ్యూటీలో ఉన్నట్లు..

అత్యవసర ఓపీ విభాగంలో ఏ డాక్టర్ డ్యూటిలో ఉన్నారో తెలిపే బోర్డులో ఏ పేర్లు కన్పించడం లేదు. అసలు డ్యూటీలో ఉన్న వివరాలు తెలిపే బోర్డులో డాక్టర్ పేర్లు రాయకుండా ఎమ్ఎన్ఓ, ఎఫ్ఎన్ఓ ల పేర్లు మాత్రమే రాసి ఉంది. డాక్టర్ లు తమకు కేటాయించిన గదిలో కాకుండా ఇతర రూంలో ఉంటున్నారు. దీంతో సిబ్బంది వైద్య పరీక్షలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

దురుసుగా వ్యవహరిస్తున్న వైద్య సిబ్బంది..

మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిలో చికిత్స కోసం వచ్చే రోగుల విషయంలో సిబ్బంది దురుసుగా వ్వవహరిస్తున్నారు. ఓపీ సేవల దగ్గర నుంచి పరీక్షించే వైద్యుల వరకు రోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వైద్యం కొరకు వచ్చే వారు తెలియక అడిగిన విసుక్కోవడం వంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

కుక్క కాటు చికిత్స కోసం వస్తే ముప్పు తిప్పలు పెడుతున్నారు: శ్రీ హరి, క్రిష్టాపురం

మా కుమారునికి కుక్క కరిచినందున చికిత్స కోసం ఈ నెల 19న వస్తే సోమవారం రామన్నారు. సోమవారం వెళ్లి వైద్యం చేయాలని కోరగా ఓపీ లేదని పంపారు. 19న ఓపీ నమోదు చేయకుండా పంపి ఈ రోజు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య సేవల నిమిత్తం ఎలాంటి సమాచారం కూడా ఇచ్చే వారు కరువయ్యారు. సిబ్బంది కుదరదని చెబితే సూపరింటెండెంట్ ను సంప్రదించి చికిత్స చేయించుకున్నారు.

Next Story