RRR కు కొత్త చిక్కులు.. అలా చేయవద్దని వేడుకున్న ప్రొడ్యూసర్..

by Disha Web Desk 19 |
RRR కు కొత్త చిక్కులు.. అలా చేయవద్దని వేడుకున్న ప్రొడ్యూసర్..
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా రికార్డ్ కలెక్షన్‌లతో దూసుకుపోతుంది. ఎన్టీఆర్, రాంచరణ్ కెరీర్‌లోనే బెస్ట్ ఫర్మామెన్స్ ఇచ్చారంటున్నారు అభిమానులు. రాజమౌళి టేకింగ్‌కు.. దేశం మొత్తం దాసోహమైపోయింది. సినిమాలో రాంచరణ్, ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్స్‌లో అయితే.. అసలు ప్రేక్షకులు సీట్లలో కూర్చోవడం లేదంటే అతిశయోక్తి కాదు. రాజమౌళి దర్శకత్వానికి తగ్గట్లు చరణ్, ఎన్టీఆర్ పాత్రలలో జీవించారు. ఇదిలా ఉండగా.. ఆర్ఆర్ఆర్‌కు కొత్త కష్టాలు వచ్చాయి.

సినిమాకు వెళ్లిన అభిమానులు మూవీలో హీరోల ఇంట్రడక్షన్ సీన్స్, ఇంకా కొన్ని హైలెట్స్ సీన్స్ ను వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు. అభిమానులు ఇలా చేయడంపై చిత్ర బృందం కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మూవీ యూనిట్ ఓ ట్వీట్ చేసింది. "దయచేసి ఫ్యాన్స్‌ను వేడుకుంటున్నాం.. థియేటర్లో సీన్లను రికార్డ్ చేసి.. స్పాయిలర్ పోస్టులను సోషల్ మీడియాలో పెట్టకండి.. మీరు ఎలా అయితే ట్రిపులార్ మూవీ మ్యాజిక్‌ను ఎంజాయ్ చేశారో అదే విధంగా అందరినీ ఎంజాయ్ చెయ్యనివ్వండి" అంటూ అభిమానులు వేడుకున్నారు. మరీ దీనిపై అభిమానులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి..!



Next Story

Most Viewed