- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లాఠీచార్జీలతో ఉద్యమాన్ని అణచలేరు
లాఠీచార్జీలతో ఉద్యమాన్ని అణచలేరని జిల్లా హాస్టల్ కన్వీనర్ పూజాం కార్తీక్ అన్నారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు జిల్లా ఏబీవీపీ ఆధ్వర్యంలో బుధవారం సిరిసిల్లలోని చేనేత విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు.

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల : లాఠీచార్జీలతో ఉద్యమాన్ని అణచలేరని జిల్లా హాస్టల్ కన్వీనర్ పూజాం కార్తీక్ అన్నారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు జిల్లా ఏబీవీపీ ఆధ్వర్యంలో బుధవారం సిరిసిల్లలోని చేనేత విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా హాస్టల్ కన్వీనర్ పూజాం కార్తీక్ మాట్లాడుతూ, రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలని శాంతియుతంగా ఆందోళన చేస్తున్న ఏబీవీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. లాఠీ దెబ్బలు, జైళ్లు, పోలీస్ స్టేషన్లు ఏబీవీపీ కార్యకర్తలకు కొత్త కాదని పేర్కొంటూ, ఉద్యమాలను అణచివేయాలనే ప్రయత్నాలు ఫలించవన్నారు. ప్రభుత్వం పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కొరత తీవ్రంగా ఉందని, విద్యార్థులు పడకలు, పుస్తకాలు వంటి కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పందించాలని కోరారు. డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకపోతే వేములవాడ, సిరిసిల్ల ప్రాంతాల్లో తమ ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మంద వంశీకృష్ణ, సిరిసిల్ల టౌన్ సెక్రటరీ రుద్రవీణ ధనుష్, ఏబీవీపీ కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.






