'తమిళ్ రాకర్స్' పైరసీ పీడ విరగడవుతుందా?

by Disha Web Desk |
తమిళ్ రాకర్స్ పైరసీ పీడ విరగడవుతుందా?
X

దిశ, సినిమా: పైర‌సీ సమస్య సినీ ఇండస్ట్రీని వేదిస్తోంది. దీనివల్ల సినిమా పరిశ్రమకు కోట్లలో న‌ష్టం వాటిల్లుతుండగా ఈ భూతాన్ని అడ్డుకోవడానికి మేకర్స్ ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకుండా పోతుంది. ఈ క్రమంలోనే తాజాగా పైర‌సీ‌ స్టోరీ నేపథ్యంలో 'తమిళ్ రాకర్స్' ప్రాజెక్ట్ తెరకెక్కుతుండగా.. తాజాగా విడుదల చేసిన టీజర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఫస్ట్ షో పూర్తి కాకముందే ఆన్‌లైన్‌లో దర్శనమిస్తున్న మూవీ ప్రింట్స్, ఎవరు ఎందుకు చేస్తున్నారు? ఎవరికి లాభం? అనే అంశాల చుట్టూ కథ తిరుగుతుండగా.. కోలీవుడ్ హీరో అరుణ్ విజ‌య్ ఇందులో ప్రధాన పాత్ర పోషించాడు. ఏవీఎమ్ ప్రొడ‌క్షన్స్ నిర్మిస్తుండగా అరివ‌జ‌గ‌న్ ద‌ర్శక‌త్వం వ‌హించిన సినిమాలో వాణీ భోజ‌న్‌, ఐశ్వర్యా మీన‌న్ కీల‌క పాత్రల్లో నటించారు. ఇక 'సోనీ లివ్' ఒరిజినల్స్‌గా తెరకెక్కుతున్న సినిమా రిలీజ్ డేట్ త్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్.



Next Story