'విక్రాంత్ రాణా' న్యూ పోస్టర్‌.. ట్రైలర్ డేట్‌ రివీల్

by Disha Web Desk 4 |
విక్రాంత్ రాణా న్యూ పోస్టర్‌.. ట్రైలర్ డేట్‌ రివీల్
X

దిశ, సినిమా : శాండల్‌వుడ్ బాద్‌‌షా కిచ్చా సుదీప్ నటించిన పాన్ ఇండియా ఫిల్మ్ 'విక్రాంత్ రాణా'పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అనూప్ భండారి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుదీప్ సరసన జాక్వెలిన్ ఫెర్నాండేజ్ నటించగా ఎప్పుడు విడుదలవుతుందా? అని ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఇటీవలే 'రా రా రక్కమ్మ' అనే పాట రిలీజ్ కాగా ప్రేక్షకుల్లో పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. దీంతో పలువురు స్టార్ హీరోస్ సుదీప్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ నెల 23న ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన మేకర్స్.. ఇందుకు సంబంధించి కొత్త పోస్టర్‌ విడుదల చేశారు. కాగా ఈ చిత్రం 3డీ వెర్షన్‌లో జులై 28న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, మలయాళం, తమిళం, హిందీ సహా మరో నాలుగు భాషల్లో రిలీజ్ కానుంది.


Next Story

Most Viewed