ఫైట్ సీన్‌తో 'లైగర్' ట్రైలర్ డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్

by Dishanational1 |
ఫైట్ సీన్‌తో లైగర్ ట్రైలర్ డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్
X

దిశ, సినిమా : విజయ్ దేవరకొండ, అనన్యా పాండే జంటగా నటించిన 'లైగర్' సినిమా కోసం ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్ ఫ్యాన్స్‌లో సరికొత్త ఊపును పెంచగా.. 'అక్డి పక్డి' సాంగ్‌తో అంచనాలు పెంచేశారు. అంతేకాదు ప్రస్తుతం మరో కిక్కిచ్చే అప్డేట్‌తో రాబోతున్నారు. 'లైగర్' నుంచి మరో పోస్టర్‌ను రిలీజ్ చేసిన మేకర్స్.. 'ఇండియా! మాస్ ఆన్ - జూలై 21, యాక్షన్ ఆన్- జూలై 21, ఎంటర్‌టైన్‌మెంట్-జూలై 21' అంటూ.. ట్రైలర్ రిలీజ్ డేట్ ప్రకటించారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ కానున్న సినిమా నుంచి.. 'బాక్సింగ్ రింగ్‌లో విలన్లతో ఫైట్ చేసేందుకు సిద్దంగా ఉన్న విజయ్' పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇక పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ భారతీయ సినీరంగ ప్రవేశం చేస్తున్నారు.


Next Story