- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్‌లో అతిపెద్ద వ్యవసాయ ఎగ్జిబిషన్.. తేదీ ఫిక్స్
రైతుల కోసం మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో అగ్రి షో పేరుతో అతి పెద్ద వ్యవసాయ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు రైతుబడి సంస్థ నిర్వాహకులు రాజేందర్ రెడ్డి శనివారం ప్రకటనలో తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రైతుల కోసం మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో అగ్రి షో పేరుతో అతి పెద్ద వ్యవసాయ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు రైతుబడి సంస్థ నిర్వాహకులు రాజేందర్ రెడ్డి శనివారం ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 20, 21, 22 తేదీల్లో మూడు రోజుల పాటు ట్యాంక్ బండ్ దిగువన ఉన్న ఎన్టీఆర్ స్టేడియంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. మూడు రోజుల్లో లక్ష మంది రైతులు హాజరవుతారనే అంచనాతో ఏర్పాట్లు చేపడుతున్నామని అన్నారు. దేశ, విదేశాలకు చెందిన నూతన వ్యవసాయ సాంకేతికతను వివరించేందుకు 500 కు పైగా కంపెనీలు ఈ ప్రదర్శనలో స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నాయని చెప్పారు. నూతన యంత్రాలు, ఏఐ టెక్నాలజీ, డ్రోన్ టెక్నాలజీ, విత్తనాలు, మొక్కలు, ఎరువులు, డ్రిప్ పరికరాల వంటివి ఎన్నో ప్రదర్శనకు వస్తాయన్నారు. మూడు రోజుల్లో పలు అంశాలపై సదస్సులు సైతం జరుగుతాయని వివరించారు. సందర్శకులు ముందుగానే www.rbagrishow.com వెబ్ సైట్ ద్వారా టిక్కెట్ బుక్ చేసుకోవచ్చని, అలా చేసుకోలేని వాళ్లు నేరుగా రావచ్చునన్నారు.






