మరో స్టార్ హీరో మూవీని తొక్కేసిన కాశ్మీరీ ఫైల్స్

by Dishafeatures2 |
మరో స్టార్ హీరో మూవీని తొక్కేసిన కాశ్మీరీ ఫైల్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 'కాశ్మీరీ ఫైల్స్' హవా నడుస్తోంది. వరుసగా స్టార్ హీరోల సినిమాల సైతం తొక్కుకుంటూపోతోంది. 'కాశ్మీరీ ఫైల్స్' దెబ్బకు బిగ్ మూవీ మేకర్స్ సైతం వెనకడుగు వేస్తున్నారు. ఈ సినిమాకు వచ్చిన ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రధాని సైతం ఈ సినిమాపై స్పందించారు. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా కలెక్షన్లను సైతం 'కాశ్మీరీ ఫైల్స్' దెబ్బ కొట్టింది. తాజాగా ఇప్పుడు మరో స్టార్ హీరోను ఇదే విధంగా బెంబేలెత్తించింది.

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తాజాగా 'బచ్చన్ పాండే'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈ సినిమా కూడా 'కాశ్మీరీ ఫైల్స్' హవాలో కొట్టుకుపోయింది. 'బచ్చన్ పాండే' పర్వాలేదు అన్న టాక్ అందుకుంది. వీకెండ్ టైంకి రూ.13 కోట్లు సంపాదించింది. కానీ ఆ తర్వాత రెండు రోజులకు రూ.12 కోట్లు మాత్రమే కలెక్షన్లు చేసింది. అయితే మరో మూడు రోజుల్లో మెస్ట్ ఎవెయిటెడ్ మూవీ 'ఆర్ఆర్ఆర్' విడుదలకు సిద్ధమవుతోంది. మరి ఈ సినిమాపై కూడా 'కాశ్మీరీ ఫైల్స్' ప్రభావం ఉంటుందా అని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మరేం జరుగుతుందో చూడాలి.


Next Story

Most Viewed