Kashmir Files: సంచలనం సృష్టించిన 'కశ్మీర్ ఫైల్స్'.. మొట్టమొదటి హిందీ సినిమాగా రికార్డ్

by Dishafeatures2 |
Kashmir Files: సంచలనం సృష్టించిన కశ్మీర్ ఫైల్స్.. మొట్టమొదటి హిందీ సినిమాగా రికార్డ్
X

దిశ, వెబ్‌డెస్క్: 'ది కాశ్మీర్ ఫైల్స్' విడుదలైనప్పటి నుంచి యావత్ దేశాన్ని ఓ ఊపు ఊపేసింది. ప్రతి రాష్ట్రంలో రాజకీయాల్లో సైతం హాట్ టాపిక్‌గా నిలిచింది. చాలా రాష్ట్రాల ఈ సినిమాను ట్యాక్స్ ఫ్రీగా కూడా ప్రకటించాయి. ఈ సినిమాపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. కానీ ఈ సినిమా మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. థియేటర్లలో ఈ సినిమా సందడి దేశమంతా వినిపించింది. కశ్మీరీ పండిట్‌ల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఓ ఉద్యమంలా మారిందనే చెప్పుకోవాలి. అయితే తాజాగా 'ది కాశ్మీర్ ఫైల్స్' సరికొత్త రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు ఏ సినిమా సాధించని ఘనత ఈ సినిమా అందుకుంది. కరోనా తర్వాత వచ్చిన బాలీవుడ్ సినిమాల్లో ఏ ఒక్కటి కూడా భారీ కలెక్షన్లు చేయలేకపోయాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా రూ.250.73 కోట్లతో రికార్డ్ చేసింది. కేవలం రూ.15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ.250 కోట్లు సంపాదించింది. దీంతో కరోనా తర్వాత రూ.250 కోట్ల కలెక్షన్స్ సాధించిన మొట్టమొదటి సినిమాగా 'ది కాశ్మీర్ ఫైల్స్' నిలిచింది.

Next Story

Most Viewed