- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జలసిరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి : ఎంపీడీవో సుజాత
భవిష్యత్ తరాలకు నీటి కొరత లేకుండా చేయాలంటే ప్రతి గ్రామంలో జలవనరుల పరిరక్షణకు ప్రజలంతా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎంపీడీవో సుజాత అన్నారు.

దిశ, కడ్తాల్ : భవిష్యత్ తరాలకు నీటి కొరత లేకుండా చేయాలంటే ప్రతి గ్రామంలో జలవనరుల పరిరక్షణకు ప్రజలంతా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎంపీడీవో సుజాత అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జలసిరి కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండలంలోని ఎక్వాయిపల్లి, మక్తా మాదారం, గోవిందాయిపల్లి, నార్లకుంట తండా, అల్మాస్‌పల్లి, గడ్డమీది తండా, కొండ్రుగాని బోడ్ తండాతో పాటు పలు గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్థులకు వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, చెరువులు, కుంటలు, కాలువల పరిరక్షణతో పాటు ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం పై అవగాహన కల్పించారు.
గ్రామాల అవసరాలను ప్రజలతో ప్రత్యక్షంగా చర్చించి, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనుల పై సూచనలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో సుజాత మాట్లాడుతూ నీటిని కాపాడటం అంటే మనభవిష్యత్తును కాపాడినట్టే. ప్రభుత్వం చేపట్టిన జలసిరి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా భావించి నీటి వనరుల సంరక్షణలో భాగస్వాములు కావాలి. ప్రజల సహకారంతోనే గ్రామాలు జలసమృద్ధిగా మారుతాయి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






