- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రియాంక చోప్రా లాంటి మహిళలు ఇండస్ట్రీకి ఇంకా ఎక్కువ మంది అవసరం: మృణాల్
టాలీవుడ్ సెన్సేషన్, 'సీతారామం' బ్యూటీ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ జోష్‌లో ఉంది.

దిశ, సినిమా: టాలీవుడ్ సెన్సేషన్, 'సీతారామం' బ్యూటీ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ జోష్‌లో ఉంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ, తాజాగా ఒక ఇంటర్వ్యూలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా(Priyanka Chopra)పై తనకున్న అభిమానాన్ని చాటుకుంది. ప్రియాంక ప్రయాణం తనకు పెద్ద ఇన్‌స్పిరేషన్ అని, ఆమె ఇంటర్వ్యూలను తను అస్సలు మిస్ అవ్వనని చెప్పుకొచ్చింది. "ప్రియాంక చోప్రా ప్రయాణం వేరు, నా ప్రయాణం వేరు.. కానీ ఇద్దరం కష్టకాలంలో ఎక్కడా వదులుకోకుండా పోరాడం. ఆ విషయంలో నాకు చాలా గర్వంగా ఉంది. ప్రియాంక మాట్లాడే తీరు, ఆమె యువతను ప్రోత్సహించే విధానం నాకు చాలా ఇష్టం.
నిజానికి మనకు ప్రియాంక చోప్రా లాంటి మహిళలు ఇంకా ఎక్కువ మంది అవసరం" అంటూ మృణాల్ ప్రశంసల జల్లు కురిపించింది. ఈ క్రేజీ బ్యూటీ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే.. మృణాల్ త్వరలో ‘డెకాయిట్’ (Dacoit) చిత్రంతో అలరించబోతోంది. యంగ్ హీరో అడివి శేష్‌తో కలిసి నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. షానియల్ డియో దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ మరియు సునీల్ నారంగ్ నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ డ్రామా, షూటింగ్ పనులు పూర్తి చేసుకుంటోంది. ఉగాది పండుగ కానుకగా మార్చి 19న ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది.






