- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జాతీయ జెండా పట్ల నిర్లక్ష్యం.. చిరిగి రెపరెపలాడుతున్న త్రివర్ణ పతాకం
by GSrikanth |
దిశ, వెబ్‌డెస్క్: భారత త్రివర్ణ పతకాన్ని ఎంత గౌరవంగా చూసుకుంటామో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

X
దిశ, వెబ్‌డెస్క్: భారత త్రివర్ణ పతకాన్ని ఎంత గౌరవంగా చూసుకుంటామో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జాతీయ జెండాను ఎప్పుడూ తలెత్తుకొని చూసేలా ఆకాశంలో ఎగరాలని కోరుకుంటాం. త్యాగాన్ని తెలిపే కాషాయం, శాంతిని చూపే తెల్లదనం, పైరు పంటలా పచ్చదనం, ధర్మం నిలిపే ఆశోకచక్రం.. ఇవన్నీ కలగలిపిన జాతీయ పతాకానికి ఏమాత్రం అవమానం జరిగినా తట్టుకోలేం. జెండా విలువ తెలిసిన నాడు ఎంత కఠిన నిబంధనలు ఉన్నా మనం మన పతాకం పట్ల ప్రేమాభిమానాలను నానాటికీ పెంచుకుంటూనే ఉంటాం. అయితే, వరంగల్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్‌లో జాతీయ జెండా నిర్లక్ష్యానికి గురైంది. రైల్వే స్టేషన్‌లో జాతీయ జెండా చిరిగి, రంద్రాలు పడి, రెపరెపలాడుతోంది. దీనిని గమనించిన కొందరు ఫొటోలు తీసి సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Next Story






