- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆగస్టు 15లోగా ఆసుపత్రి పూర్తి చేయాలి.. లేకపోతే చర్యలు తప్పవు
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యానికీ తావులేదని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

దిశ, కోదాడ: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యానికీ తావులేదని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం కోదాడలో రూ.26 కోట్ల వ్యయంతో నిర్మాణంలో ఉన్న 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి భవన పనులను ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్‌తో కలిసి మంత్రి ఆకస్మికంగా పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, పనులు ఆశించిన వేగంతో సాగకపోవడంపై కాంట్రాక్టర్‌ను నిలదీశారు.
"ప్రజల అవసరాలకు సంబంధించిన పనుల్లో జాప్యాన్ని ఏమాత్రం సహించం. ఆగస్టు 15 నాటికి ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. లేకుంటే కఠిన చర్యలు తప్పవు" అని మంత్రి హెచ్చరించారు. నిర్మాణంలో నాణ్యతతో పాటు వేగానికీ సమాన ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి, ఆసుపత్రికి అవసరమైన మౌలిక వసతులు, వైద్య పరికరాలు, వైద్య సిబ్బంది నియామకంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించేలా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
వ్యవసాయ పరిస్థితులపై స్పందిస్తూ, రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు పరిస్థితులకు అనుగుణంగా పంట మార్పిడి చేపట్టాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు తీసుకుని మార్కెట్‌కు అనుకూలమైన పంటలు సాగు చేస్తే మంచి ఆదాయం పొందే అవకాశముందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్న మంత్రి, రైతు భరోసా పథకం కింద అర్హులైన రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసినట్లు వెల్లడించారు. వ్యవసాయాభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతులకు అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ ఎర్నేని కుసుమ బాబు, వైస్ చైర్‌పర్సన్ దేవరపల్లి మల్లేశ్వరి, ఆర్డీవో సూర్యనారాయణ, తహసీల్దార్ సంతోష్ కిరణ్, మున్సిపల్ కమిషనర్ ఏ. రమాదేవి, కౌన్సిలర్ కందుల కోటేశ్వరరావు, డీసీహెచ్‌ఎస్ వెంకటేశ్వర్లు, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దశరథ నాయక్, వైద్యులు, కాంగ్రెస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.






